DRAINS: విజయవాడలోని అనేక ప్రాంతాల్లో వర్షపు నీటి డ్రెయిన్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ పారుదల నిలిచి మురుగుమయంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో 50 శాతం పనులు పూర్తయినా.. ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేనందున.. డ్రెయిన్లు.. నీటి పారుదలకు అడ్డంకులుగా మారాయి. మూడేళ్లకుపైగా ఇదే స్థితిలో నగర ప్రజలు అగచాట్లు పడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం రావడంతో.. ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనంటూ.. భయపడుతున్నరు. ఇప్పటికే కురిసిన అరకొర వర్షాలకే మురుగునీరంతా.. రోడ్లపైకి మోకాళ్లోతులో వచ్చి చేరింది. స్థానికులతోపాటు.. వాహనదారాలు తీవ్ర అవస్థలు పడ్డారు. రాబోయే రోజుల్లో తమ పరిస్థితేంటో తలచుకుంటేనే భయంకరంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
DRAINS: విజయవాడలో చినుకు పడితే.. వణకాల్సిందే..! - విజయవాడ తాజా వార్తలు
DRAINS: అమ్మో వర్షకాలం వచ్చింది..ఇక తమ పరిస్థితి ఏమిటో, ఎప్పుడు వర్షం పడుతుందో.., ఏ రహదారిలో చిక్కుకుపోతామో, ఎప్పుడు ఇంటికి చేరుతామో అనే రకరకాల ప్రశ్నలు విజయవాడ నగరవాసుల్లో తలెత్తతున్నాయి. కారణం మూడేళ్ల నుంచి వర్షపు నీటి డ్రెయిన్ల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. సమస్యను తీర్చేందుకు గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, పలు కారణాల వల్ల అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి. నగరపాలక సంస్థ కమిషనర్లు వస్తున్నారు.. పోతున్నారు తప్ప.. సమస్యకు పరిష్కారం చూపటం లేదని వాపోతున్నారు.