ETV Bharat / city

భవిష్యత్తులో నియామకాలన్నీ ఆన్‌లైన్‌లోనే..

ఇంజినీరింగ్‌ ప్రాంగణ ఎంపికల్లో మార్పులు జరుగుతున్నాయి. ఒక అంశంపై నిపుణత నుంచి బహుళ నైపుణ్యాలవైపు మార్పు సాగుతోంది. ప్రాంగణ ఎంపికలకు విద్యార్థులను సంసిద్ధత చేసే విధానం, నియామకాల్లో వస్తున్న మార్పులపై ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య శనివారం విజయవాడలో సదస్సు నిర్వహించింది.

skills for campus interviews for engineering students
భవిష్యత్తులో నియామకాలన్నీ ఆన్‌లైన్‌లోనే..
author img

By

Published : Mar 21, 2021, 8:39 AM IST

Updated : Mar 21, 2021, 1:48 PM IST

భవిష్యత్తులో నియామకాలన్నీ ఆన్‌లైన్‌లోనే..

ఇంజినీరింగ్‌ ప్రాంగణ ఎంపికల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగ నియామకాల్లో ఇప్పుడు తార్కిక శక్తి, బహుళ నైపుణ్యాలకు(క్రాస్‌ స్కిల్స్‌) కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. విద్యార్థుల్లోని తార్కిక శక్తిని గేమింగ్‌ రౌండ్‌తో అంచనా వేస్తున్నాయి. ఒక సమస్యకు పలు ప్రత్యామ్నాయ మార్గాలను విద్యార్థి కనుక్కునేలా ఈ విధానం ఉంటుంది. దీంతోపాటు అభ్యర్థి అన్ని రకాల టెక్నాలజీలపైనా పని చేయగలడో..లేదోనని అంచనా వేస్తున్నాయి. ఒక అంశంపై నిపుణత నుంచి బహుళ నైపుణ్యాలవైపు మార్పు సాగుతోంది. ఉదాహరణకు పైథాన్‌, జావా, డేటాబేస్‌ ఇలా క్రాస్‌ స్కిల్స్‌ ఉన్న వారిని ఎంపిక చేసుకుంటున్నాయి. ప్రాంగణ ఎంపికలకు విద్యార్థులను సంసిద్ధత చేసే విధానం, నియామకాల్లో వస్తున్న మార్పులపై ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య శనివారం విజయవాడలో సదస్సు నిర్వహించింది. దీనికి హాజరైన హెక్సావేర్‌, టీసీఎస్‌, హెచ్‌పీ, హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌, వర్చూసా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ప్రతినిధులు నియామకాల్లో వస్తున్న మార్పులను వెల్లడించారు.

మౌఖిక పరీక్షలూ ఇక ఆన్‌లైన్‌లోనే..
కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రాంగణ నియామకాలు జరగ్గా ఈ విధానాన్ని కంపెనీలు భవిష్యత్తులోనూ కొనసాగించనున్నాయి. హెక్సావేర్‌ సంస్థ కరోనా ముందు వరకు ఆన్‌లైన్‌ మౌఖిక పరీక్షలను 10శాతం దాకా నిర్వహించేది. ఇప్పుడు పూర్తిగా వర్చువల్‌ విధానంలోకి మారిపోయింది. ‘ఈ ఏడాది 3-4 నెలల్లోనే మా సంస్థ 5వేల మందిని నియమించింది’ అని హెక్సావేర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వీరప్పజీ శివన్న వెల్లడించారు.

సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగ ప్రకటనలు

yashwin
యశ్విన్‌, హెచ్‌పీ కంపెనీ ప్రతినిధి

‘‘ఉద్యోగ నియామకాల ప్రకటనలు రాబోయే రోజుల్లో సామాజిక మాధ్యమాల్లోనే రానున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ఈ విధానం కొనసాగుతోంది. ఉద్యోగాలకు 79శాతం మంది వీటిల్లోనే వెతుకుతున్నారు’’

- యశ్విన్‌, హెచ్‌పీ కంపెనీ ప్రతినిధి

ఏ బ్రాంచైనా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం

‘ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచి చదివినా కోడింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలను సాధించవచ్చు. మెకానికల్‌, బయోటెక్నాలజీ ఇంజినీరింగ్‌ వారు సమీకృత అభ్యసనతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పొందవచ్చు.

- పర్వీన్‌ అహ్మద్‌, టీసీఎస్‌ మేనేజర్‌

కృత్రిమ మేధతో గుర్తిస్తాం

‘వర్చువల్‌ మౌఖిక పరీక్షల్లో గొంతు ముఖ్యం కాదు. హావభావాలు, సమాధానం చెప్పే తీరును మాత్రమే పరిశీలిస్తారు. విద్యార్థులు ఎలాంటి తప్పిదాలు చేసినా కృత్రిమ మేధతో కంపెనీలు గుర్తిస్తాయి. కొంతమంది అభ్యర్థులను అడిగిన ప్రశ్నలు కొద్ది క్షణాల్లోనే అంతర్జాలంలో వచ్చేస్తున్నాయి. వీటి కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం’

- కృతివాసన్‌ శివరామకృష్ణన్‌, వర్చూసా భారత ప్రాంగణ నియామకాల అధిపతి

కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ముఖ్యం

‘‘తెలుగు విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు తక్కువగా ఉంటున్నాయి. ప్రశ్నించే తత్వం కనిపించడం లేదు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు చేసే వ్యాపారం అత్యధికంగా విదేశాలతోనే ముడిపడి ఉన్నందున కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ప్రధానం’’

- శ్యామ్‌సన్‌, హెచ్‌సీఎల్‌ మానవవనరుల విభాగం అధిపతి

ఇదీ చదవండి:

వయసులో అమ్మ... వృద్ధాప్యంలో నువ్వెవరమ్మా..?

Last Updated : Mar 21, 2021, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.