రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఒకరికి మంచి చేయడానికి మరో పేదవాడికి జీవనాధారం లేకుండా చేయడం ఏంటని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పేదలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే ప్రభుత్వం తరపు నుంచి చేయాలని ఆయన హితవు పలికారు. అంతే కానీ ఒకరికి మంచి చేయడానికి ఇంకొకరికి అన్యాయం చేయడం సరికాదని హితవు పలికారు. వైకాపా ప్రచారం కోసం తాతల కాలం నాటి నుంచి ఎస్సీ కుటుంబాలకు ఆసరాగా ఉన్న భూముల్ని లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఇల్లు పీకి పందిరేసే ఇలాంటి వింత, దుర్మార్గపు ఆలోచనలు వైకాపాకు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు తెదేపా ప్రభుత్వం నిర్మించిన గృహాలను వారికి పంచాలని, సగంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
'ఒకరికి మేలు చేసేందుకు.. మరొకరికి అన్యాయం చేస్తారా..?'
పేదలకు మంచి చేయాలనుకుంటే ప్రభుత్వం తరఫు నుంచి చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు హితవు పలికారు. ఒకరికి మంచి చేయడానికి మరో పేదవాడికి అన్యాయం చేస్తారా అని ఆయన ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఒకరికి మంచి చేయడానికి మరో పేదవాడికి జీవనాధారం లేకుండా చేయడం ఏంటని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పేదలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే ప్రభుత్వం తరపు నుంచి చేయాలని ఆయన హితవు పలికారు. అంతే కానీ ఒకరికి మంచి చేయడానికి ఇంకొకరికి అన్యాయం చేయడం సరికాదని హితవు పలికారు. వైకాపా ప్రచారం కోసం తాతల కాలం నాటి నుంచి ఎస్సీ కుటుంబాలకు ఆసరాగా ఉన్న భూముల్ని లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఇల్లు పీకి పందిరేసే ఇలాంటి వింత, దుర్మార్గపు ఆలోచనలు వైకాపాకు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు తెదేపా ప్రభుత్వం నిర్మించిన గృహాలను వారికి పంచాలని, సగంలో ఆగిపోయిన గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:
'సాధించేది ఏమి లేకనే జగన్ సిట్ అంటున్నారు'