ETV Bharat / city

ప్రభుత్వ స్కీమ్​లన్నీ స్కాంల కోసమే: చంద్రబాబు - ప్రభుత్వం ప్రవేశపెడుతున్న స్కీమ్​లన్ని స్కాంల కోసమే

ఓ వైపు కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే... మరోవైపు వైకాపా చేస్తున్న సామాజిక విధ్వంసం రాష్ట్రాన్ని అథోగతి పాలు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏడాదిలో 2లక్షల కోట్ల పెట్టుబడులను తరిమేశారని మండిపడ్డారు. ముడుపులు, వాటాల కోసమే వైకాపా భూములు కొనుగోళ్లు చేస్తోందని ఆరోపించారు. జులై 4వ తేదీకి అమరావతి ఉద్యమం 200వ రోజుకి చేరుతున్నందున.. ఆ రోజు రైతులకు సంఘీభావంగా నిరసనలు తెలపాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న స్కీమ్​లన్ని స్కాంల కోసమే: చంద్రబాబు

author img

By

Published : Jun 30, 2020, 4:09 PM IST

జులై 4వ తేదీకి అమరావతి ఉద్యమం 200వ రోజుకి చేరుతున్నందున..ఆ రోజు రైతులకు సంఘీభావంగా వర్చువల్​లో నిరసనలు తెలపాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నేతలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించిన చంద్రబాబు... ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ రైతులకు సంఘీభావం తెలపాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న స్కీమ్‌లన్నీ స్కాంల కోసమేనని చంద్రబాబు విమర్శించారు. ఒకప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పార్టీలు పోరాటం చేసేవన్న ఆయన... వైకాపా పాలన చూసి ప్రజలే తిరగబడుతున్నారని ధ్వజమెత్తారు.

సరస్వతి, 108 కుంభకోణాలను నిలదీసినందుకు తెదేపా నాయకులకు నోటీసులు పంపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై వైకాపా అనేక ఆరోపణలు చేసిందని..అందులో అవినీతి లేదని కేంద్రం తేల్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. పింక్ డైమండ్ తన ఇంట్లో ఉందని ప్రచారం చేశారని.. ఇప్పుడు దానిపై ఎందుకు మాట్లాడటం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల కోసం సేకరించే భూముల్లో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.

ఏపీలో కరోనా రికవరీ రేటు తక్కువే

5 వారాల్లో కరోనా 400 శాతం పెరిగిందని... ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రికవరీ రేటు తక్కువగా ఉందన్న ఆయన...నాసిరకం పరీక్షలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం మాస్క్​లు పెట్టుకోకుండా, ప్రజలకు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చెబుతారని నిలదీశారు. రాష్ట్రంలో వైద్యులకు ఇప్పటికీ పీపీఈ కిట్లు అందించకపోవటం వైకాపా ప్రభుత్వ వైఫల్యమేనన్న చంద్రబాబు... పీపీఈల కోసం విశాఖ ఈఎన్​టీ ఆసుపత్రిలో వైద్యులు ధర్నా చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు.

ఎంఎస్​ఎంఈలపై తప్పుడు ప్రచారంతో ప్రజల్లో వైకాపా గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 3,800కోట్ల రూపాయల పారిశ్రామిక ప్రోత్సాహక బకాయిల చెల్లింపు జరిగిందని గుర్తు చేశారు. అపోలో టైర్స్, కియా కార్ల పరిశ్రమలను తెదేపా ప్రభుత్వం తీసుకువస్తే.. తామే తెచ్చామని వైకాపా చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

ఏ1, ఏ2 నిందితులు కుమ్మక్కై...

ఏ1, ఏ2 నిందితులు కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత కంపెనీల కోసం ఏ1 , వియ్యంకుడి కంపెనీల కోసం ఏ2 చేస్తున్న స్కామ్​లను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 1,300కోట్ల రూపాయల విలువైన సున్నపు రాయి గనులను, రైతులకు చెందాల్సిన నీళ్లను సీఎం జగన్ కంపెనీ సరస్వతీ పవర్ కు కేటాయించుకున్నారన్న చంద్రబాబు.. 25ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ, ప్రభుత్వ భూములు లేవని కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు. 0.036 టీఎంసీల నీళ్లకు కేంద్రం అనుమతినిస్తే.. 0.07టీఎంసీలు కేటాయించుకున్నారన్న చంద్రబాబు... మొదట 5ఏళ్లకు ఇచ్చి, తర్వాత జీవిత కాలానికి పొడిగించుకోవడాన్ని తప్పుపట్టారు. 108 అంబులెన్స్ లలో 307కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్ల స్థలాల భూసేకరణకు కేటాయించిన 8వేల కోట్లలో 5వేల కోట్లు స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు.

విక్రమ్ హత్య అమానుషం

గురజాలలో దళిత యువకుడు విక్రమ్ హత్య అమానుషమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విక్రమ్ హత్యకు సీఎం జగన్ బాధ్యత వహించి అక్కడి సీఐని సస్పెండ్ చేయడంతోపాటు గురజాల ఎమ్మెల్యేపై హత్యానేరం నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు పంచాయితీ భవనాలకు వైకాపా రంగుల తొలిగాయన్న చంద్రబాబు... వాటితోపాటు రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వాటర్ ట్యాంకులు, కరెంటు స్థంభాలకు వేసిన వైకాపా రంగులను కూడా తొలగించేందుకు పోరాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.