వైకాపా పాలనలో రాష్ట్రంలోని నగరాలు పతనమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. విశాఖలో తెదేపా నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన..కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సులభతర జీవన సూచీ ర్యాంకుల్లో తిరుపతి స్థానం 4 నుంచి 46కు పడిపోవడం బాధాకరమన్నారు. విజయవాడ..9 నుంచి 41వ ర్యాంకుకు పడిపోయిందన్నారు. ర్యాంకుల పతనం పురపాలికల పరిస్థితికి అద్దంపడుతోందని ఆక్షేపించారు. పురపాలక ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు.
ఈ సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి