కరోనా నుంచి మానవాళిని రక్షించాలంటూ... అల్లాను వేడుకుందామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక ప్రార్థనలు చేద్దామని కోరారు. పవిత్రత, త్యాగాల చిహ్నమైన రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలందరికీ తన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
"క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్. సేవా దృక్ఫథానికి, సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ముస్లింలంతా భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి. శాంతి, దయ, ప్రేమే లక్ష్యంగా చేసిన ఉపవాస దీక్షలు సమాజ శ్రేయస్సుకు మార్గనిర్దేశం కావాలి. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే పండుగ చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు.
ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్: లోకేశ్
ముస్లిం సోదదులందరికీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
"మనిషిలోని బలహీనతలను, స్వార్థ భావాలను తుడిచిపెట్టి, వాటి స్థానంలో క్రమశిక్షణ, సేవాగుణం, సోదర భావాలను పెంపొందించేదే రంజాన్ ఉపవాస దీక్షా మాసం. అటువంటి పవిత్ర మాస దీక్షలను ముగించుకుని పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. రంజాన్ పండుగను ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా" అని ఓ ప్రకటనలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.
ఇదీ చదవండి: