ETV Bharat / city

అమరావతి ఉద్యమంలో అంతిమ విజయం రైతులదే: చంద్రబాబు - జగన్​పై చంద్రబాబు కామెంట్స్

అమరావతి ఉద్యమంలో అంతిమ విజయం రైతులదేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పంటల బీమా చెల్లింపుల్లో వైకాపా ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని ఆరోపించారు. వరదల్లో నష్టపోయిన ధాన్యాన్ని కొనగులో చేయటం లేదని ధ్వజమెత్తారు. రైతుల పాలిట ప్రభుత్వం శాపంగా మారినందునే రాష్ట్రంలో అన్నదాతల వరుస ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని దుయ్యబట్టారు.

రౌడీలకు అడ్డాగా ఏపీని మార్చేశారు: చంద్రబాబు

author img

By

Published : Dec 15, 2020, 3:07 PM IST

Updated : Dec 15, 2020, 10:28 PM IST

ప్రజారాజధాని అమరావతికి వైకాపా తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతుల పోరాటం వృథా కాదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అప్పులు తెచ్చుకునేందుకే వ్యవసాయ మోటార్లు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉంది

అవనిగడ్డలో వారంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవటం ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. పంట నష్టం అంచనాను ప్రభుత్వం సక్రమంగా చేపట్టకపోవటంతో అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా గూండాయిజం పెరిగిపోయిందన్న చంద్రబాబు.. స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉందన్నారు. రాష్ట్ర ఆదాయం సృష్టించడం చేతకాక పన్నులు పెంచి ముఖ్యమంత్రి జగన్‌ కాలాన్ని నెట్టుకొస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

తాగునీటి పన్ను, చెత్త పన్ను, సీవరేజీ పన్ను ఇలా అన్నీ పెంచుకుంటూ పోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చివరికి మరుగుదొడ్ల వినియోగం, జుట్టు పెంపు, రోడ్లపై నడకకు కూడా పన్ను వేస్తారేమో అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అంతకుముందు పొట్టిశ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలోనూ చంద్రబాబు మాట్లాడారు.

నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ తెదేపా

తెదేపా నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అన్న చంద్రబాబు... జమిలి ఎన్నికలు వచ్చేలోపు మీలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేస్తానని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో వైశ్యుల అభివృద్ధికి చేయాల్సినవన్నీ చేస్తామని స్పష్టం చేశారు. తెదేపా హయాంలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని వైకాపా నేతలు రాబందుల రాజ్యంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం నియోజకవర్గంలో బాలికను హత్యాచారం చేస్తే కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా బయటపెట్టలేదని మండిపడ్డారు. జగన్‌ అధికారంలోకి వస్తే పులివెందుల పంచాయతీలు పెరుగుతాయని ముందే హెచ్చరించినా ఏదో చేస్తారని ఆశించి ప్రజలు భంగపడ్డారని చంద్రబాబు అన్నారు.

ఎదురుతిరిగే పరిస్థితి

భూములు, ఆస్తులు మన పేరుతో ఉన్నాయో లేదో రోజూ ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బతిన్న వాళ్లంతా ఎదురుతిరిగితే పరిస్థితి ఏమిటో జగన్‌రెడ్డి కనీసం ఆలోచించడం లేదన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా రాజకీయం చేశారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు.

ఇళ్ల పట్టాల పంపిణీ తెదేపా విజయం

డిసెంబర్ 25 న వైకాపా ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ తెదేపా విజయంగా చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా ఇస్తున్న స్థలాల విస్తీర్ణం చాలా తక్కువన్న చంద్రబాబు... గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రైతుల ఖాతాల్లో 1252 కోట్ల పంటల బీమా సొమ్ము జమ

Last Updated : Dec 15, 2020, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.