ETV Bharat / city

ప్రతి అన్యాయానికి.. భవిష్యత్తులో వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా: చంద్రబాబు - చంద్రబాబు లేటెస్ట్ న్యూస్

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెదేపా మద్దతుదారులకు ఇచ్చిన మైజార్టీని వైకాపా ప్రభుత్వం రివర్స్ చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో జరిగిన ప్రతి అన్యాయానికి భవిష్యత్తులో వడ్డీతో సహా.. తిరిగి చెల్లించే బాధ్యత తనదే అని తేల్చిచెప్పారు.

ప్రతి అన్యాయానికి భవిష్యత్తులో వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా

author img

By

Published : Feb 18, 2021, 8:26 PM IST

పంచాయితీ ఎన్నికల్లో జరిగిన ప్రతి అన్యాయానికి భవిష్యత్తులో వడ్డీతో సహా.. తిరిగి చెల్లించే బాధ్యత తనదని తెదేపా అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. ఎన్నికల్లో తెదేపా మద్దతుదారులకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ భవన్​లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్..కుందుర్తి గ్రామ ప్రజలతో కలిసి చంద్రబాబుని కలిశారు. కుందుర్తి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం 12 వార్డుల్లో తెదేపా బలపరిచిన అభ్యర్ధులు 8 వార్డుల్లో గెలుపొందటంతో పాటు సర్పంచ్ అభ్యర్థి ముందంజలో ఉండటం చూసి అక్రమాలతో ఫలితాన్ని తారుమారు చేశారని ఆరోపించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరగాల్సి ఉండగా..వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అర్థరాత్రి వరకూ సాగదీసి ఫలితాలను తారుమారు చేసిందన్నారు. వైకాపా నాయకుల దుర్మార్గులకు అడ్డుకట్టపడే రోజు దగ్గర్లోనే ఉందని చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో గెలుపు కోసం రూ. 20 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజలు తెదేపా మద్దతుదారులకు ఇచ్చిన మెజార్టీని వైకాపా ప్రభుత్వం రివర్స్ చేసిందని ఆక్షేపించారు. ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా.. బెదిరిస్తే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది.. ఉన్మాదం గెలిచింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.