ETV Bharat / city

యువతను ప్రోత్సహిస్తాం.. వచ్చే ఎన్నికల్లో వారికి 40 శాతం సీట్లు: చంద్రబాబు - చంద్రబాబు న్యూస్

రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన పార్టీ 40వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన సమాజ హితం కోరుకునేవారు, శక్తి సామర్థ్యాలు ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని అన్నారు. యువతను ప్రోత్సహించాలని తెదేపా నిర్ణయం తీసుకుందని.., వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో వారికి 40 శాతం సీట్లు
వచ్చే ఎన్నికల్లో వారికి 40 శాతం సీట్లు
author img

By

Published : Mar 29, 2022, 10:12 PM IST

Updated : Mar 30, 2022, 4:00 AM IST

స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ ఉంటారన్నారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన పార్టీ 40వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండె చప్పుడు అని అన్నారు. ప్రతి ఒక్కరి రక్తంలో తెలుగుదేశం పార్టీ ఉందని.., ప్రజల నరనరాల్లో తెదేపా జీర్ణించుకుపోయిందన్నారు. 21 ఏళ్లు అధికారంలో,19 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా.. తమది ప్రజాపక్షమేనని చెప్పారు. నవతరానికి నాంది పలికిన గొప్పవ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. పటేల్‌-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్​కే దక్కుతుందన్నారు. మహిళలకు రిజర్వేషన్లు వచ్చాక రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. వెనకబడిన వర్గాలకు తమ పార్టీ ప్రాతినిధ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. యువతను ప్రోత్సహించాలని తెదేపా నిర్ణయం తీసుకుందని.., వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు.

యువతను ప్రోత్సహిస్తాం.. వచ్చే ఎన్నికల్లో వారికి 40 శాతం సీట్లు

"గ్రామ కమిటీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త వేడుకలు చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు. 40 దేశాల్లో 200 నగరాల్లో తెదేపా ఆవిర్భావ వేడుకలు. 40 ఏళ్లుగా పార్టీ కొనసాగడం అరుదైన అవకాశం. అధికారం కోసం ఎన్టీఆర్‌ పార్టీ ఏర్పాటు చేయలేదు. తెలుగువారి సంక్షేమమే తెదేపా పరమావధి. తెలుగుజాతికి పునరంకితం కావాల్సిన సమయం వచ్చింది."- చంద్రబాబు తెదేపా అధినేత

దూరదృష్టితో ఆలోచించాం: తెదేపా హయాంలోనే విజన్‌ 2020 తీసుకువచ్చానని చంద్రబాబు అన్నారు. తెదేపా దూరదృష్టితో నాలెడ్జ్‌ అకాడమీకి ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. బయోటెక్నాలజీకి ప్రాధాన్యం ఉందని ముందే గ్రహించామని చెప్పారు. తెదేపా హయాంలో జీనోమ్‌ వ్యాలీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జీనోమ్‌ వ్యాలీ నుంచి కరోనా టీకా రావడం దేశానికి గర్వకారణమని అన్నారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ కేంద్రం ఏర్పాటుకు కృషిచేశానని తెలిపారు. శంషాబాద్‌లో విమానాశ్రయం తీసుకువచ్చామని..,అభివృద్ధి ఎవరు చేసినా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

"33 వేల ఎకరాల్లో రాజధాని ఏర్పాటుకు కృషిచేశా. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగింది అన్నారు. నాపై ఉన్న నమ్మకంతో రైతులు భూములు త్యాగాలు చేశారు. తెలుగు ప్రజలు పేరు ప్రఖ్యాతలు పొందాలని కోరుకున్నాం. హైదరాబాద్‌లో అడుగడుగునా నా కష్టం సత్ఫలితాలు ఇస్తోంది. గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుకు సహకరించాం. గోపీచంద్‌ అకాడమీ నుంచి ఛాంపియన్లు వస్తున్నారు. పలు సాగునీటి ప్రాజెక్టులు తెదేపా హయాంలోనే కట్టాం. పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. నదుల అనుసంధానంతో అందరికీ నీళ్లివ్వాలని తలపెట్టాం." - చంద్రబాబు, తెదేపా అధినేత

అలాంటి వారు రాజకీయాల్లోకి రావాలి: యువత గర్వంగా పనిచేయాలంటే తెదేపా ఉండాలి అని చంద్రబాబు అన్నారు. యువత ముందుకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. సమాజ హితం కోరుకునేవారు రాజకీయాల్లోకి రావాలన్నారు. శక్తి సామర్థ్యాలు ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించడంలో తెదేపా ముందుందని..,రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు.

"తెదేపా కుటుంబంలో 70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. తెదేపాను నమ్ముకున్న వారంతా నా కుటుంబసభ్యులే. పార్టీని కాపాడింది.. జెండా మోసింది కార్యకర్తలు. కార్యకర్తలపై దాడులు జరిగినా జెండా వదల్లేదు. కార్యకర్తల రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల కోసం రూ.వంద కోట్ల బీమా తీసుకువచ్చాం. బీమాతో పాటు కార్యకర్తల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నా. కార్యకర్తలను ఆదుకోవడం బాధ్యతగా భావిస్తున్నా. కార్యకర్తల సాధికారత.. ఆర్థికంగా ఎదిగేందుకు కృషిచేస్తా. కొండనైనా బద్దలు కొట్టే శక్తి తెదేపా సైన్యానికి ఉంది. ఏపీ, తెలంగాణలో సభ్యత్వ నమోదు చేపట్టాం."- చంద్రబాబు, తెదేపా అధినేత

ఎన్నో తెచ్చాను.. ఇప్పుడేం జరుగుతోంది?: 'సంపద సృష్టిస్తే ఉద్యోగాలు వస్తాయి. అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి దక్షిణ కొరియాకు వెళ్లి కియా మోటార్స్‌ కంపెనీ తెచ్చాను. లులూ కంపెనీని ఆంధ్రప్రదేశ్‌ రమ్మని పలుమార్లు అడిగితే విశాఖపట్నం వచ్చారు. వారు సంస్థ ఏర్పాటుచేసే సమయానికి ప్రభుత్వం మారడంతో జగన్‌ వాటా అడిగారో.. డబ్బులు అడిగారో గానీ, వారు ఏపీకి రాబోమని చెప్పి వెళ్లిపోయారు. హీరో మోటార్‌ కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కు తేవడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. తెదేపాలో 70 లక్షల కుటుంబాల వారు సభ్యులుగా ఉన్నారు. పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీదే' అని చంద్రబాబు అన్నారు

27 మంది కల్తీసారా తాగి చనిపోతే..: జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీసారా తాగి చనిపోతే అక్కడ సారా లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ అక్కడే వేల లీటర్ల సారా పట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. బాధితులకు ఒక్క పైసా ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం వారికి అన్యాయం చేసింది. సారా మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఎన్టీఆర్‌ ట్రస్టు సాయం చేసింది. ఇలా తెదేపా వల్ల మీకు కలిగిన ప్రయోజనం గురించి సామాజిక మాధ్యమాల్లో రాయండి. లేదా మీరే వెబ్‌సైట్‌ పెట్టుకుని రాయండి, లేకపోతే వీడియో తీసి పెట్టండి. తెలంగాణలో తెదేపాను పటిష్ఠం చేయడంపైనా దృష్టి పెడతా. కొందరు నాయకులు ఎక్కువ మాట్లాడుతూ తక్కువ పనిచేస్తున్నారు. - చంద్రబాబు, తెదేపా అధినేత

తెలంగాణలో ప్రతిచోటా తెదేపా చేసిన అభివృద్ధి కనిపిస్తుంది: 'తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా తెదేపా చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) పెట్టడానికి ఫార్చ్యూన్‌ 500 కంపెనీల వారు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలను చూస్తున్నారని తెలిసి వారిని నేను హైదరాబాద్‌కు పిలిపించి స్వయంగా టిఫిన్‌ వడ్డించి ఇక్కడే ఐఎస్‌బీ పెట్టాలని కోరాను. ఇక్కడే పెట్టేలా కష్టపడ్డాను. అక్కడ నా పిల్లలు చదువుతున్నారా? హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే తపనతో అలాంటి సంస్థల కోసం ఎంతో కష్టపడ్డాను. 1999లో జీనోమ్‌ వ్యాలీ పెట్టకముందు ఇక్కడ రెండు బయోటెక్‌ కంపెనీలే ఉండేవి. కానీ ఐటీ తర్వాత బయోటెక్నాలజీకే భవిష్యత్తు ఉందని గుర్తించి.. జీనోమ్‌ వ్యాలీ ఏర్పాటు చేయించడం వల్లనే ఈ రోజు అక్కడ కరోనాకు టీకా కనిపెట్టి దేశానికి అందించే నగరంగా హైదరాబాద్‌కు పేరొచ్చింది. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టడానికి డబ్బుల్లేవని అప్పటి ప్రధాని వాజపేయి చెపితే నేను కట్టిస్తానని చెప్పాను. అలాగే ఔటర్‌ రింగురోడ్డు తెచ్చాం' అని చంద్రబాబు అన్నారు

తెలుగువారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి: హైదరాబాద్‌ శివారు కోకాపేటలో 1994కి ముందు ఎకరా రూ.60వేలు లేదా 70వేలు ఉండేది. ఇప్పుడు అక్కడ ఎకరా రూ.60 కోట్లు. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలి. ప్రపంచమంతా తెలుగుజాతి పేరుప్రఖ్యాతులు పొందాలని తెదేపా ఆలోచిస్తుంది. బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించి సాగునీటి రంగానికి ప్రాధాన్యమిచ్చాం. పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నదులను కలిపాం. దేశంలో తొలిసారిగా ఇలా నదులను కలిపింది తెదేపా పాలనలోనే. ఐఐటీ సీట్లను పొందడానికి ఏం చేస్తున్నారు, మీ రహస్యం ఏంటని చుక్కా రామయ్యని ఒకసారి అడిగాను. ప్రవేశపరీక్ష ద్వారా వందమందిని ఎంపికచేసి ఐఐటీ సీట్లు వచ్చేలా శిక్షణ ఇస్తానని చెప్పారు. ఒక రామయ్య వంద సీట్లు తెప్పిస్తుంటే ఉమ్మడి రాష్ట్రం మొత్తమ్మీద ఎన్ని సీట్లు రావాలని నేను ప్రోత్సహించడంతో ఇప్పుడు దేశంలో 20-30 శాతం సీట్లు తెలుగు పిల్లలకు వస్తున్నాయి’ అని చంద్రబాబు చెప్పారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బక్కని నర్సింలు, నేతలు బుచ్చయ్యచౌదరి, అరవిందకుమార్‌ గౌడ్‌, అనిత, నన్నూరి నర్సిరెడ్డి తదితరులు మాట్లాడారు.- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయలన్నా తెలుగుదేశంతోనే సాధ్యం: లోకేశ్

Last Updated : Mar 30, 2022, 4:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.