రాష్ట్ర ప్రయోజనాలక కోసం పోరాడానే తప్ప తనకు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత విభేదాలు లేవని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, ఇతర కేంద్ర హామీలపై నాడు ముఖ్యమంత్రి జగన్ చెప్పిందేంటి.., ఇప్పుడు చేసేదేంటని నిలదీశారు.
మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులు మళ్లీ తీసుకురావటం తప్పుడు విధానమని మండిపడ్డారు. శాసన మండలి ఇప్పటికే సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేసిన బిల్లును మళ్లీ ఎలా తెస్తారని ధ్వజమెత్తారు. మండలిలోనూ మళ్లీ బిల్లుల ప్రవేశపెట్టడంపై గట్టిగా పోరాడతామన్న చంద్రబాబు.., ఇందులో రెండో ఆలోచనే లేదని తేల్చి చెప్పారు.