సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో పోలీసు పాత్ర కీలకమని చంద్రబాబు అన్నారు. అరాచక శక్తులను అణచివేసే ప్రయత్నంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ఎందరో పోలీసులు ప్రజల హృదయాల్లో చిరంజీవులై నిలిచారని గుర్తుచేశారు. విశ్వకవి ఠాగూర్ చెప్పినట్లు స్వేచ్ఛా స్వర్గాన్ని సమాజానికి అందించేది పోలీసులేనని లోకేష్ అన్నారు. నిస్వార్థమైన, అంకిత భావంతో కూడిన సేవలందిస్తూ ప్రాణాలర్పించిన త్యాగధనులందరి సేవలు చిరస్మరణీయమన్నారు.
ఇదీ చదవండి: 'చతుర్భుజ విన్యాసాల'తో చైనాకు చెక్!