ETV Bharat / city

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మృతి పట్ల చంద్రబాబు, నారా లోకేశ్ సంతాపం - chandrababu mourns the death of Endluri Sudhakar

సాహితీవేత్త, ఆచార్య ఎండ్లూరి సుధాక‌ర్ మృతి పట్ల.. తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు భాషా, సాహిత్య రంగాలకు ఆయన మృతి తీరని లోటు అన్నారు.

Nara Lokesh mourns the death of Acharya Endluri Sudhakar
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మృతి పట్ల నారా లోకేశ్ సంతాపం
author img

By

Published : Jan 28, 2022, 12:39 PM IST

సాహితీవేత్త, ఆచార్య ఎండ్లూరి సుధాక‌ర్ మృతి పట్ల.. తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. తెలుగు ర‌చ‌నా రంగంలో వెలుగొందిన ఎండ్లూరి సుధాక‌ర్ మృతి సాహితీ లోకానికి తీర‌ని లోటని అన్నారు. ఉత్తేజ పూరిత రచ‌న‌ల‌తో స‌మాజంపై ఎండ్లూరి త‌న‌దైన ముద్ర వేశారని కొనియాడారు. ద‌ళిత ర‌చ‌యిత‌గా సుధాక‌ర్ ర‌చ‌న‌లు ఎందరికో స్ఫూర్తినిచ్చాయ‌ని గుర్తు చేశారు. తెలుగు ఆచార్యుడిగా ఎంద‌రో విద్యార్థులు, ప‌రిశోధ‌కుల‌కు మార్గనిర్దేశం చేశార‌న్నారు.

  • అభ్యుదయ స్ఫూర్తినిచ్చే రచనలతో తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ గారి మరణం విచారకరం. సుధాక‌ర్ మృతి తెలుగు సాహితీ లోకానికే కాదు, దళిత సమాజానికి కూడా తీరని లోటు.(1/2) pic.twitter.com/4vlm9ZulKF

    — N Chandrababu Naidu (@ncbn) January 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. తెలుగు భాషా, సాహిత్య రంగాలకు ఆయన మృతి తీరని లోటని అన్నారు. పాఠాలతో విద్యార్థులను, రచనలతో సమాజాన్ని చైతన్యపర్చారని గుర్తు చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

  • తెలుగుదనం-దళిత కలం-హక్కుల గళం ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి మృతి తెలుగు భాష, సాహిత్య రంగాలకి తీరని లోటు. పాఠాలతో విద్యార్థులను, రచనలతో సమాజాన్ని చైతన్యం చేసి అణగారిన దళితులకు అండగా నిలిచిన సుధాకర్ గారి స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం. pic.twitter.com/LlO5oz6SwS

    — Lokesh Nara (@naralokesh) January 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

Murder at Nellore: దారుణం.. బ్లేడుతో యువకుడి గొంతుకోసిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.