Chandrababu daggubati Venkateswara rao: రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో ఉన్న చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు.. చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించాయి. హైదరాబాద్‌లో నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కూతురు వివాహం జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, అలుళ్లు, మనవలు, మనవరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈసందర్భంగా.. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కలిసి ఫొటోలు దిగారు. పురంధేశ్వరి, భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
ఇదీ చదవండి: 'పార్టీ కోసం కోట్లు ఖర్చుపెట్టాం.. ఎమ్మెల్సీ హామీ అంటూ మర్రిని మోసం చేశారు'