ETV Bharat / city

'సాహిత్యంతో సమాజాన్ని సంస్కరించవచ్చని గురజాడ నిరూపించారు' - గురజాడ అప్పారావు జయంతి

మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా సమాజానికి ఆయన చేసిన సేవలను తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్​లు స్మరించుకున్నారు. ఆయన రచనలు సమాజాన్ని సంస్కరించాయని కీర్తించారు.

chandrababu about gurajada birth anniversary
చంద్రబాబు
author img

By

Published : Sep 21, 2020, 3:10 PM IST

గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆ మహాకవి సాహితీసేవను స్మరించుకుందామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పిలుపునిచ్చారు. గురజాడ రచనలు చదివితే ఆయన తన కాలాన్ని దాటి ఎంత ముందుకు చూడగలిగారో అర్థమవుతుందని చంద్రబాబు కొనియాడారు. 'ఒట్టి మాటలు కట్టిపెట్టవోయ్.. గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌' అన్న గురజాడ మాటలు ప్రజాసేవలో ఉన్నవారికి ఒక స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు.

సాహిత్యం అనేది కాలక్షేపానికి కాదని, సమాజాన్ని సంస్కరించి ముందడుగు వేయించే ఒక ఆయుధమని చాటిన మహనీయుడు గురజాడ అప్పారావు అని లోకేశ్ కీర్తించారు. ముఖ్యంగా స్త్రీలకు మద్దతుగా నిలిచి వారి సమస్యలను వెలుగులోకి తేవడంలో ఆయన కృషి అనితర సాధ్యమని గుర్తు చేశారు.

ఇవీ చదవండి..

ఫైబర్‌నెట్‌ వివరాలన్నీ అందుబాటులోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.