ప్రాజెక్టులపై కేంద్రం గెజిట్‌పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బచావత్ ట్రైబ్యునల్, గెజిట్‌కు వ్యత్యాసాలను లోతుగా పరిశీలించాలని చెప్పారు. వైకాపా ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తోందని.. రాష్ట్ర ప్రయోజనాల పట్ల బాధ్యత లేకుండా సీఎం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడుతుందని తేల్చిచెప్పారు.
విజయవాడ రమేష్ ఆసుపత్రిలో పార్టీ నేత బచ్చుల అర్జునుడుని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. చంద్రబాబుతో పాటు ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనలో బచ్చుల అర్జనుడు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిశాక గుండెపోటు రావడంతో హుటాహుటిన విజయవాడ రమేష్ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. యాంజియో ప్లాస్టీ సర్జరీ వైద్యులు చేశారు. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆరోగ్యం నిలకడగా ఉందని చంద్రబాబుకు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: