ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మున్సిపల్ మంత్రి, అధికారులు మున్సిపల్ శాఖపై సమీక్ష జరిపిన తీరుపై సీహెచ్ బాబూరావు మండిపడ్డారు. ఒకవైపు కరోనా, ఆర్థిక మాంద్యంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన గుర్తుచేశారు. వ్యాపారాలు దెబ్బతిని, ప్రజలు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి తరుణంలో పన్నులలో రాయితీలు ఇవ్వాలని, వడ్డీలు, పెనాల్టీలు రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నారన్న బాబూరావు.. ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కేంద్రం కసరత్తు!