ETV Bharat / city

'వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలి' - కేంద్ర బృందంపై సోమువీర్రాజు వార్తలు

వరద నష్టం అంచనా వేసేందుకు బృందాలను పంపాలని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్రాన్ని కోరారు. కేంద్రమంత్రి పురుషోత్తంతో నిర్వహించిన దృశ్యమాధ్యమ భేటీలో రాష్ట్ర నేతలతో పాటు పాల్గొన్న ఆయన... వరదలు, పంట నష్టంపై వివరించారు.

వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలి

author img

By

Published : Oct 23, 2020, 5:25 PM IST

Updated : Oct 23, 2020, 8:53 PM IST

రాష్ట్రంలో వరద ముంపుతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పురుషోత్తమ రూపాల హామీ ఇచ్చారు. రాష్ట్ర రైతులు అధైర్యపడొద్దని... కేంద్ర ప్రభుత్వం అండగానిలుస్తుందని భరోసా ఇచ్చారు. భాజపా రాష్ట్రశాఖ వర్చువల్‌ పద్ధతిలో వరద నష్టాల వివరాలను కేంద్ర మంత్రి రూపాల దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలో పది రోజులు భారీగా వర్షాలు కురిశాయని... కృష్ణా,గోదావరి నదులతోపాటు పలు ఉపనదులు, వాగులు, కాల్వలు, చెరువులు పొంగి గ్రామాలను ముంచేశాయని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కాపుమీద ఉన్న వరి, పత్తి, మినుములు, వేరుశనగ, అరటి, ఉల్లి తదితర పంటలు నీటిలో మునిగి..రైతులకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. పార్టీకి చెందిన నాలుగు బృందాలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశాయన్నారు.

ఆ నివేదికలను పంపిస్తామని... వాటిని పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలతో వర్షపాతం వందశాతానికి మించిందని... భాజపా జాతీయ కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌, సుజనా చౌదరి తెలిపారు.

పొలాల్లోని పంటలన్నింటినీ రైతులు కోల్పోయినా.. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఎంపీలు సీఎం రమేష్‌, సుజన చౌదరి విమర్శించారు. వరద ముంపు గ్రామాల్లో కనీసం పర్యటించలేదని ఆరోపించారు. ముంపు నివారణ సమస్యలు, నష్టాలను అంచనావేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. కనీసం తక్షణ నష్టపరిహారం కూడా అందించలేదని విమర్శించారు.

ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా ఫోన్‌ చేసి వరదపై ముఖ్యమంత్రితో మాట్లాడారని... కానీ ముఖ్యమంత్రి తగిన విధంగా స్పందించలేదని చెప్పారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం బృందాలను పంపించి నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి పురుషోత్తం రుపాల స్పందించారు. మోదీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు.

రైతులకు నష్టం, కష్టం కలిగితే వాటికి వెంటనే ఉపశమనం కలిగించి, నష్టనివారణ చర్యలు చేపట్టడం తమ బాధ్యత అన్నారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదికలు అందలేదని అయినా.. నిపుణుల బృందాన్ని పంపించి పంట నష్టాలు అంచనా వేసి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ టీజీ వెంకటేష్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్‌బాబు, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు, విష్ణువర్దనరెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇదీచదవండి

వాగులో కొట్టుకుపోయిన కారు...తండ్రీ కుమార్తె గల్లంతు

Last Updated : Oct 23, 2020, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.