kanakamedala at rajyasabha: ఏపీలో దొరికిన గంజాయి పరిమాణం.. మూడేళ్లలో మూడు రెట్లు పెరిగిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో తెలిపారు. తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ బుధవారం అడిగిన ప్రశ్నకు.. ఆయన సమాధానమిచ్చారు. 2018లో గంజాయి ఆధారిత మాదక ద్రవ్యాలు 33,930.5 కిలోలు ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకోగా.. 2019లో అది 66,665.5 కిలోలకు, 2020లో ఏకంగా 1,06,042.7 కిలోలకు చేరింది. రాష్ట్రంలో గంజాయి సాగును అడ్డుకోవడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పలు చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: