2023 నాటికి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 141 మిలియన్ టన్నులకు పెంచనున్నట్టు రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వాని అడిగిన ప్రశ్నకు నౌకాయాన మంత్రి మన్సుఖ్ మాండవీయ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. విశాఖ పోర్టుకు 2 లక్షల డెడ్ వెయిట్ టన్నేజ్ ఉన్న భారీ నౌకలు రాకపోకలు సాగించేలా కాలువల లోతును పెంచేందుకు డ్రెడ్జింగ్, అలాగే అదనపు బెర్తుల నిర్మాణం చేపట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 126 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం ఉన్న విశాఖపోర్టులో ఆధునీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. మొత్తంగా 12 ప్రాజెక్టులను రూ.3086 కోట్లతో చేపడతామని మిగిలిన పనులు అంతర్గత నిధులతోనే చేపట్టనున్నట్టు కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ తెలియజేసింది. అలాగే 9.57 ఎంఎంటీఏ సామర్థ్యం ఉన్న కంటైనర్ టెర్మినల్ కూడా ఏర్పాటు కానుందని స్పష్టం చేసింది. అవుటర్ హార్బర్ లోనూ మెకనైజేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలియచేసింది. మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్‌గా కాన్కర్ సంస్థ ఈ ప్రాంతంలో 1009 కోట్లను పెట్టుబడులు పెట్టనున్నట్టు స్పష్టం చేసింది.
విశాఖపట్నం పోర్టు అభివృద్ధికి రూ.4 వేల 65 కోట్లు - విశాఖ పోర్టు తాజా వార్తలు
విశాఖపట్నం పోర్టు అభివృద్ధి కోసం 4 వేల 65 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయనున్నట్టు కేంద్ర నౌకాయాన మంత్రిత్వశాఖ తెలిపింది. రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వాని అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.