ETV Bharat / city

కేంద్ర పరిధిలోకి వైద్య విద్య సీట్ల భర్తీ! - mbbs counselling news

వైద్య విద్య ప్రవేశాల నిర్వహణ అధికారాలు రాష్ట్రాల నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం, రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కేంద్రీకృత విధానంలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి.. ఇటీవల అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య అధికారులతో చర్చించారు. వైద్య సీట్లకు ఉన్న ప్రాధాన్యం, విలువైన సమయం ఆదా అంశాలను పరిగణలోనికి తీసుకున్న మెజారిటీ రాష్ట్రాలు.. సూత్రప్రాయ అంగీకారం తెలియజేశాయి. అలాగే పలు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.

counselling for mbbs students
వైద్య విద్య ప్రవేశాలు
author img

By

Published : Jul 10, 2021, 5:09 AM IST

వైద్య విద్య ప్రవేశాల నిర్వహణ అధికారాలు రాష్ట్రాల నుంచి కేంద్ర పరిధిలోనికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు సాగుతున్నాయి. కేంద్రీకృత విధానంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహణపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి (వైద్య విద్య) ఇటీవల అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య అధికారులతో ప్రాథమిక స్థాయిలో చర్చించారు. వైద్య సీట్లకు ఉన్న ప్రాధాన్యం, విలువైన సమయం ఆదా వంటి అంశాలు పరిగణనలోనికి తీసుకున్న మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక స్థాయిలో కేంద్రానికి సమ్మతి తెలియచేశాయి.

అలాగే.. పలు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందిస్తూ.. ‘‘మీ ప్రతిపాదనను ప్రాథమికంగా అంగీకరిస్తున్నాం. మా రాష్ట్రంలో ఆర్టికల్‌ 371 (స్థానిక, స్థానికేతర) అమలలో ఉంది. ఉమ్మడి రాష్ట్ర విభజన కూడా జరిగింది. ప్రవేశాల ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటుంది. ఎయిమ్స్‌, జిప్‌మర్‌, ఇతర జాతీయ వైద్య సంస్థల్లో ప్రవేశాలను కూడా ఒకేసారి నిర్వహించాలి’’ అని సూచించింది.

తెలంగాణ ప్రభుత్వమూ కేంద్ర ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. ‘‘మా రాష్ట్రంలోనూ ఆర్టికల్‌ 371 అమల్లో ఉంది. రాష్ట్ర చట్టాన్ని అనుసరించి బీసీలకు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ప్రవేశాల ప్రక్రియలో ఉన్న సంక్లిష్టతను పరిగణనలోనికి తీసుకోవాలి’’ అని పేర్కొంది. కేంద్రం స్పందిస్తూ.. ‘‘న్యాయపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రవేశాల నిర్వహణలో రాష్ట్రాల నిబంధనలను పరిగణనలోనికి తీసుకుంటాం. జాతీయ వైద్య సంస్థల్లోనికి ప్రవేశాలను కూడా మేమే చేస్తాం’’ అని సమాధానం ఇచ్చింది. తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం జాతీయ స్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహణపై విధానపరమైన నిర్ణయాలు తీసుకొని లిఖితపూర్వకంగా తెలియచేసిన తర్వాత స్పందిస్తామని స్పష్టంచేశాయి.

ప్రస్తుత భర్తీ విధానమిదీ..

దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌/పీజీలో ఉన్న వాటిలో 15% సీట్లను కేంద్రానికి అప్పగిస్తున్నాయి. వీటిని నీట్‌ ర్యాంకు ఆధారంగా జాతీయ కోటాలో రెండు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి భర్తీ చేస్తోంది. ఆపై మిగిలిన సీట్లను మళ్లీ రాష్ట్రాలకు వెనక్కి పంపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 85% సీట్లను, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని ఎ, బి, సి కేటగిరీ సీట్లను ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం భర్తీ చేస్తోంది. బి, సి కేటగిరి సీట్లు యాజమాన్య కోటా పరిధిలోనికి వస్తాయి. తెలంగాణాలో కె.ఎన్‌.ఆర్‌. ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా వైద్య విద్య సీట్ల భర్తీ జరుగుతోంది.

జాతీయ వైద్య కమిషన్‌ రాకతో..!

జాతీయ వైద్య కమిషన్‌ కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కేంద్రీకృత విధానంలో కౌన్సెలింగ్‌ ద్వారా సీట్ల భర్తీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. సీట్ల బ్లాకింగ్‌ను నిరోధించేందుకు, విద్యార్థులపై ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు, సమయం ఆదా చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంటోంది. ఇటీవల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో నిర్వహించిన సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా అంగీకారం తెలపడం, వ్యక్తంచేసిన అభిప్రాయాలు, సందేహాలతో కూడిన ‘మినిట్స్‌’ను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని గుజరాత్‌ ప్రభుత్వం కేంద్రానికి సూచించింది. పంజాబ్‌, రాజస్థాన్‌, త్రిపుర, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, కర్ణాటక, ఉత్తరాఖండ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌, జమ్మూ-కశ్మీర్‌, దిల్లీ, పుదుచ్చేరి ప్రభుత్వాలు ప్రాథమికంగా ఆమోదాన్ని తెలిపాయి.

రాష్ట్ర ప్రభుత్వాలనిబంధనలను అనుసరించి..

రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తంచేసిన సందేహాలపై కేంద్రం స్పందిస్తూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రవేశాల చట్టాలు, నియమ నిబంధనలు అనుసరించి మాత్రమే కేంద్రీకృత విధానంలో ప్రవేశాలు జరుపుతామని స్పష్టంచేసింది. ఇందులో ఎటువంటి తికమక అవసరంలేదని తేల్చిచెప్పింది. రాష్ట్రాల వారీగా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తామని వెల్లడించింది.

అమలు ఎప్పటి నుంచి..

ప్రస్తుత 2021-22 విద్యా సంవత్సరంలో ఈ కొత్త ప్రతిపాదన అమల్లోనికి వస్తుందా? లేదా? అన్న దానిపైనా కూడా స్పష్టత రావడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై పలుమార్లు చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాతనే అధికారిక నిర్ణయం వెలువడుతుంది.

ఇదీ చదవండి:

JAGAN PLAYED CRICKET: సీఎం జగన్​ బ్యాటింగ్​..ఎంపీ అవినాష్​ బౌలింగ్​

Delta variant: కొవిడ్​ కంటే 1000 రెట్లు వైరల్​ లోడ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.