ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 13 రాష్ట్రాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మెరుగు (central government agreement with ADB for health care) పరిచేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)తో కేంద్ర ప్రభుత్వం మూడు వందల మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం చేసుకుంది. 13 రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం కోసమే ఏడీబీతో రుణ ఒప్పందం చేసుకున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు ప్రకటించింది. ఈ రుణంతో.. పట్టణ ప్రాంతాల్లో మురికి వాడల్లో ఉంటున్న 5.1 కోట్ల మంది సహా.. మొత్తం 25.6 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్రం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో సమగ్ర ప్రాథమిక సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసి, వ్యాధులను నివారించడానికి అవసరమైన కార్యక్రమాలను అమలు చేయడం కోసం ఈ రుణాన్ని ఉపయోగించనున్నట్లు కేంద్రం ప్రకటనలో పేర్కొంది.
ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. వ్యాధుల వ్యాప్తిని నివారించడం, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను పటిష్టం చేసి అన్ని వ్యాధులకు చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చి..ఆరోగ్య అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న లక్ష్యంతో కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి
Online Cinema Tickets: ఆన్లైన్లోనే సినిమా టికెట్లు.. మాకు ఆ ఉద్దేశం లేదు: మంత్రి పేర్ని