![ex central minister panabaka lakshmi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9993803_final.jpg)
రాష్ట్రాన్ని అత్యాచారాంధ్రప్రదేశ్గా సీఎం జగన్ మార్చారని.. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి దుయ్యబట్టారు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో.. ఎస్సీ మహిళను దారుణంగా హత్యాచారం చేసినా.. మానవత్వంతో కనీసం స్పందించలేదని విమర్శిస్తూ లేఖను విడుదల చేశారు.
ఆ ఘటన మరువక ముందే.. ధర్మవరంలో స్నేహలతపై హృదయ విదారకర ఘటన చోటుచేసుకుందని మాజీ మంత్రి పేర్కొన్నారు. పోలీసులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఈ అఘాయిత్యం జరిగిందని ఆరోపించారు. పోలీసులే మృతురాలి తల్లిదండ్రులను బెదరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అరాచక పాలనలో మహిళా హోంమంత్రిని కేవలం ఉత్సవ విగ్రహంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే.. ప్రభుత్వానికి ఎస్సీల ఉసురు తగలక మానదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: