National Highways Upgradation: రాష్ట్రంలో ములకాలచెరువు నుంచి మదనపల్లె సెక్షన్‌లోని 42 జాతీయ రహదారిని 4 లేన్‌గా మార్చే ప్రతిపాదనకు ఆమోదాన్ని తెలియచేసినట్టు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఈ మార్గంలో మొత్తం రూ.480 కోట్లతో 4 లేన్ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటిస్తూ ట్విటర్లో వివరాలను వెల్లడించారు. దీంతోపాటు విజయవాడ మీదుగా ఉత్తరాఖండ్ వరకూ ఉన్న 30 నెంబరు జాతీయ రహదారికి సంబంధించిన విస్తరణ పనులకూ 388 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు తెలియచేశారు. 170 కిలోమీటర్ నుంచి 700 వరకూ, 234 కిలోమీటర్ల నుంచి 567 వరకూ రెండు లేన్లుగా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
![National Highways Upgradation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13911243_road.png)
ఇదీ చదవండి :
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసులో మళ్లీ మొదలైన విచారణ.. ఆ కోణంలో దర్యాప్తు !