బహ్రెయిన్‌లోని ఏపీ కార్మికుల సమస్యలపై కేంద్రం స్పందించింది. కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న కేంద్రానికి లేఖ రాశారు. ఆహారం, వసతి లేక ఏపీ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని విజ్ఞప్తులు రావడంతో సీఎం కేంద్రాన్ని సంప్రదించారు. ఎన్‌హెచ్ఎస్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యపై.. సంస్థ ప్రతినిధులతో భారత రాయబార కార్యాలయం మాట్లాడింది.
భారత్‌కు వచ్చేవారికి విమాన టికెట్లు అందిస్తామన్న ఎన్‌హెచ్‌ఎస్ సంస్థ అంగీకరించింది. ఎంబసీ అధికారులతో చర్చల అనంతరం ఏపీ కార్మికుల సమస్య పరిష్కారమైందని ఏపీఎన్ఆర్టీఎస్ పేర్కొంది.
ఇదీ చదవండి:
Rayapati: వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వచ్చి తీరుతుంది: రాయపాటి