ETV Bharat / city

CBN: మత్స్యకారులకు ఉరి బిగించేలా జీవోనెం.217: చంద్రబాబు

author img

By

Published : Sep 5, 2021, 6:08 PM IST

Updated : Sep 6, 2021, 4:40 AM IST

రెండేళ్లుగా బీసీల సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రశ్నార్థకమైందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కుల వృత్తులు, చేతివృత్తుల వారి ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. మత్స్యకారుల ఉపాధి దెబ్బతీసే జీవో 217కు మేం వ్యతిరేకమని స్పష్టం చేశారు. మత్స్యకారుల వనరులను కొందరి చేతుల్లో పెట్టేందుకే జీవో ఇచ్చారని లేఖలో మండిపడ్డారు.

రెండేళ్లుగా బీసీల సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రశ్నార్థకమైంది

గత రెండేళ్లుగా రాష్ట్రంలో బీసీల సామాజిక, ఆర్ధిక అభివృద్ధి ప్రశ్నార్ధకమయ్యిందని..,అనాదిగా కుల వృత్తులపై ఆధారపడిన వారి ఎదుగుదల దెబ్బతిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమం – కుల వృత్తులు, చేతివృత్తుల వారి ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. మత్స్యకారుల ఉనికికి గొడ్డలిపెట్టులా ఉన్న జీవో నెం.217ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెరువులు, కాలువలు, రిజర్వాయర్లపై పూర్తి హక్కులను మత్స్యకార సొసైటీలకే అప్పగించాలన్నారు. చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవనం సాగించే మత్స్యకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం..వారి వృత్తిని, జీవనాన్ని నాశనం చేసేలా తీసుకొచ్చిన జీవో నెం.217ను తెదేపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. చేతి వృత్తులు, కులవృత్తులపై ఆధారపడిన బలహీన వర్గాలను సామాజికంగా ఆర్ధికంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. నిధులు, విధులు లేని కార్పొరేషన్ల ఏర్పాటుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని..,రెండేళ్లలో కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా రూపాయి రుణం ఇవ్వలేదని దుయ్యబట్టారు. బీసీ సబ్ ప్లాన్‌ను నిర్వీర్యం చేశారని ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో మత్స్యకారులకు సబ్సిడీ పథకాలు అందించడం లేదని తుపాన్లతో నష్టపోయిన వారికి ఎలాంటి భరోసా లేదని విమర్శించారు. చనిపోయిన మత్స్యకారులకు బీమా కూడా లేదని ధ్వజమెత్తారు. సముద్రంలో వేటకు వెళ్లి మరణించిన వారికి కనీసం మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ఉపాధి కోల్పోయి చేతి వృత్తులు, కుల వృత్తుల వారి జీవనం అత్యంత దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కాలువలు, కుంటలు, రిజర్వాయర్లలో చేపలు పెంచుకుంటూ దశాబ్దాలుగా భృతి పొందుతున్న మత్స్యకారుల్ని కాదని..వాటిని వేలం వేసేలా ఉత్తర్వులివ్వడం మత్స్యకారుల మెడకు ఉరి బిగించడమేనని మండిపడ్డారు. జీవో నెం.217తో మత్స్యకారుల్ని కూలీలుగా మారుస్తున్నారని ఆక్షేపించారు. మత్స్యకారుల ఆధీనంలో ఉండాల్సిన వనరుల్ని..ఇసుక, మద్యం మాదిరిగా కొంత మంది చేతుల్లో పెట్టేందుకే జీవో ఇచ్చినట్లుందని దుయ్యబట్టారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ప్రభుత్వం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. సొసైటీలను నిర్వీర్యం చేస్తూ మత్స్యకారుల్ని రోడ్డున పడేసేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. దేశానికే ఆక్వా హబ్​గా నిలవాల్సిన రాష్ట్ర మత్స్యరంగం..ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అధ్వాన్న విధానాలతో ప్రశ్నార్ధకమైందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, రిజర్వాయర్ల వంటి నీటి వనరుల్లో చేపలు పెంచుకునే హక్కులు మత్స్యకార సొసైటీలకే ఉండేలా చూడాలని సూచించారు. మత్స్యకారుల న్యాయబద్దమైన హక్కుల్ని కాపాడాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

రెండేళ్లుగా బీసీల సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రశ్నార్థకమైంది. నిధులు, విధులు లేని కార్పొరేషన్లతో ప్రచారం చేస్తున్నారు. కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా రూపాయి రుణం ఇవ్వలేదు. మత్స్యకారుల ఉపాధి దెబ్బతీసే జీవో 217కు మేం వ్యతిరేకం. మత్స్యకారుల వనరులను కొందరి చేతుల్లో పెట్టేందుకే జీవో. మత్స్య సంపద వేలం ఉత్తర్వులు.. వారి మెడకు ఉరి లాంటివే. అనాలోచిత నిర్ణయాలతో మత్స్యరంగాన్ని నాశనం చేస్తున్నారు.-చంద్రబాబు, తెదేపా అధినేత

మత్స్యకారులకు రాయితీలిచ్చి ప్రోత్సహించాం

‘తెదేపా ప్రభుత్వ హయాంలో ఉప ప్రణాళిక ద్వారా బీసీల సంక్షేమాభివృద్ధిని ప్రోత్సహించాం. సొసైటీల ఆధ్వర్యంలోని మత్స్యకారులకు 75% రాయితీతో వలలు, పడవలు, ఐస్‌ పెట్టెలు, మోపెడ్‌లు, ఆటోలు, వ్యాన్‌లు ఇచ్చాం. మహిళలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించాం. గత రెండేళ్లుగా వారికి ఎలాంటి రాయితీ పథకాలు లేవు. తుపాన్ల సమయంలో నష్టపోయిన వారికి భరోసా కొరవడింది. చనిపోయిన వారికి బీమా లేదు. సముద్రంలో వేటకు వెళ్లి మరణించిన వారికి కనీసం ధ్రువీకరణ పత్రాలూ ఇవ్వడం లేదు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి

TDP: ఎస్సీల సంక్షేమం గాలికి.. ఎస్సీ చట్టాల దుర్వినియోగం: జవహర్

Last Updated : Sep 6, 2021, 4:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.