ETV Bharat / city

CBN and lokesh on formation day: 'తెదేపా ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలదొక్కుకుంటుంది'

CBN and lokesh on formation day: తెదేపా ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలదొక్కుకుంటుందని.. పార్టీ స్థాపించిన ముహూర్త బలం అలాంటిందని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా కార్యకర్తలు, నేతలు, అభిమానులకు.. పార్టీ అధినేత చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

CBN and lokesh speaks over TDP formation day
తెదేపా ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలదొక్కుకుంటుంది
author img

By

Published : Mar 29, 2022, 10:28 AM IST

Updated : Mar 29, 2022, 10:42 AM IST

CBN and lokesh on formation day: తెదేపా కార్యకర్తలు, నేతలు, అభిమానులకు.. పార్టీ అధినేత చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం.. రాజకీయ అనివార్యమన్నారు. ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు.

  • కొందరు వ్యక్తుల కోసమో...కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు మన తెలుగుదేశం. ప్రజల కోసం...ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం....ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది.(2/5)

    — N Chandrababu Naidu (@ncbn) March 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది.కొందరికే పరిమితమైన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది.తెలుగుదేశం అంటేనే అభివృద్ధి..సంక్షేమం.సంస్కరణల ఫలితాలు గ్రామ స్థాయికి అందించిన చరిత్ర తెదేపాది. పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెదేపానే.ప్రాంతీయ పార్టీగా ఉన్నా.. జాతీయ భావాలతో సాగే పార్టీ తెదేపా.పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా వేడుకలు నిర్వహించాలి.ప్రతిఒక్కరూ పార్టీ కోసం పునరంకితమయ్యేలా వేడుకలు ఉండాలి. తెదేపా అవసరమేంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలి. - చంద్రబాబు, తెదేపా అధినేత

ఎన్​ఆర్​ఐ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. తెదేపా 40 ఏళ్ల వేడుకల్లో భాగంగా.. ఎన్​ఆర్​ఐ అభిమానులను ఉద్దేశించి పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. తెదేపా ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలదొక్కుకుంటుందని.. పార్టీ స్థాపించిన ముహూర్త బలం అలాంటిందని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెదేపా పుట్టిందని.. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగు చరిత్ర అంటే తెదేపా ఆవిర్భావానికి ముందు, తర్వాత అని చదవాల్సిందేనన్నారు.

తెదేపా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి సంస్కరణలు ఎన్టీఆర్‌ తెచ్చారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫుడ్‌ సెక్యూరిటీ విధానం అమలులో ఉంది.రూ.2కే కిలో బియ్యం పథకంతో ఎన్టీఆర్ ఎప్పుడో అమల్లో పెట్టారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతం కానుంది. పార్టీ స్థాపించిన మూహుర్త బలం గొప్పది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీ తట్టుకుని నిలబడుతుంది.పార్టీని ఎంత ఇబ్బంది పెట్టినా రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తోంది. ఏ దేశంలో ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్తుకు ఎన్ఆర్ఐలు సహకరించాలి. - చంద్రబాబు, తెదేపా అధినేత

ఎన్టీఆర్‌, చంద్రబాబు మన ధైర్యం.. 40 వసంతాల పసుపు పండుగ జరుపుకోవడం ఆనందంగా ఉందని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు మన ధైర్యమని.. కార్యకర్తలు మన బలం, పసుపు జెండా మన పవర్ అని అన్నారు.

  • అధికారం ఉన్నా లేకపోయినా ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేద్దాం.(2/2)#40GloriousYearsOfTeluguDesam#TDPFoundationDay

    — Lokesh Nara (@naralokesh) March 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్‌. అభివృద్ధిని పరిచయం చేసింది చంద్రబాబు. అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజల కోసం ఆలోచించేది తెదేపానే.ఆవిర్భావం సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేలా అడుగులు వేద్దాం. -నారా లోకేశ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి:

TDP 40TH ANNIVERSARY : రాజకీయ చైతన్యఝరికి 40 ఏళ్లు

Last Updated : Mar 29, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.