జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు(cbi court)లో వాదనలు జరిగాయి. పిటిషన్ వేసినందున తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని రఘురామ(mp raghurama) తరఫు న్యాయవాది శ్రీవెంకటేశ్ కోర్టు దృష్టికి తెచ్చారు. కేసులో సాక్షులుగా ఉన్న అధికారులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రలోభ పెడుతున్నారని వివరించారు. ఇతర నిందితులకూ ప్రయోజనాలు కల్పిస్తున్నారని తెలిపారు. బెయిల్ రద్దు పిటిషన్(bail cancellation petition)పై సీబీఐ అభిప్రాయం వెల్లడించకపోవడం సరికాదని రఘురామ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. జగన్, రఘురామ వాదనల తర్వాత లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని సీబీఐ.. కోర్టుకు తెలిపింది. రఘురామకు పిటిషన్ వేసే అర్హత లేదని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ ఉద్దేశాలతోనే పిటిషన్ వేశారని వెల్లడించారు. జగన్, రఘురామ, సీబీఐ లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించిన సీబీఐ న్యాయస్థానం విచారణ ఈనెల 8కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: AP-TS Water War: తెలుగు రాష్టాల మధ్య జలవివాదం..ప్రాజెక్టుల వద్ద భద్రత పెంపు