అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఈ నెల 10న విజయవాడలో మహిళలు పెద్ద ఎత్తున చేపట్టిన ఆకస్మిక నిరసనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. అమరావతి పరిరక్షణ సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేశారు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నా అనుమతి లేకుండా నిరసన ర్యాలీలు నిర్వహించినందుకు వారిపై చర్యలు చేపట్టారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్‌స్టేషన్లలో 479 మంది మహిళలపై కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్‌లు 188, 341, 353, 143, 149, పోలీస్ యాక్ట్ 32 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు విజయవాడ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
సంబంధిక కథనాలు: