ETV Bharat / city

రెవెన్యూ బకాయిలు రూ.10,997.30 కోట్లు.. లెక్క తేల్చిన కాగ్ - Cag Report on ap revenue news

రాష్ట్రానికి రెవెన్యూ పద్దుల కింద 10వేల 997 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నట్లు కాగ్‌ తేల్చింది. 2015-19 మధ్యకాలంలో రాబడులు పెరిగినట్లు వెల్లడించింది. రుసుములు చెల్లించకపోయినా మద్యం కోటా మంజూరు చేసినందుకు అబ్కారీ శాఖ ఆదాయం కోల్పోయిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల్లో పెట్టుబడులపై వాస్తవరేటు ప్రతికూలంగా ఉందని వెల్లడించింది.

రెవెన్యూ బకాయిలు రూ.10,997.30 కోట్లు
రెవెన్యూ బకాయిలు రూ.10,997.30 కోట్లు
author img

By

Published : May 21, 2021, 9:07 AM IST

రాష్ట్రానికి రెవెన్యూ పద్దుల కింద 2019 మార్చి 31వ తేదీ నాటికి 10 వేల 997.30 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నట్లు కాగ్ వెల్లడించింది. అమ్మకాలు, వర్తకం, ఇతర పన్నులు, అబ్కారీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, రుసుములు, వాహనాలపై పన్నులు, ఇనుము మినహా గనుల తవ్వకం, లోహ పరిశ్రమలు, విద్యుత్తుపై పన్నులు, సుంకాలు వంటి కొన్ని ప్రధాన రెవెన్యూ పద్దుల కింద ఈ బకాయిలు ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్ర విభజన తర్వాత అంటే.. 2015-19 మధ్య కాలంలో రాబడులు పెరిగినట్లు పేర్కొంది. 2016-17లో 11 శాతం, 2017-18లో 12 శాతం, 2018-19లో 17 శాతం మేర పెరిగినట్లు కాగ్‌ తెలిపింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, సహాయక గ్రాంట్లు ఆర్థిక సంఘం సిఫారసుల ఆధారంగా సమకూరుతాయని పేర్కొంది. వీటిని మినహాయించి వనరుల సమీకరణలో రాష్ట్ర పనితీరును పన్నుల రాబడి, పన్నేతర రాబడి పరంగా అంచనా వేసినట్లు తెలిపింది.

కోల్పోయిన అబ్కారీ ఆదాయం

చెల్లించాల్సిన రుసుమును వసూలు చేయకుండానే మద్యం కోటా మంజూరు చేసినందున రాష్ట్ర అబ్కారీ శాఖ 22.4 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. 2018-19 సంవత్సవరం కాగ్‌ ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. మద్యం కోటా దస్త్రాలను పరిశీలించినప్పుడు.. కమిటీ సిఫార్సులు లేకుండా ఐదు మద్యం కర్మాగారాలకు అదనపు మద్యం కోటాను మంజూరు చేసినట్లు తేలింది. ఈ ఐదింట్లో 4 కర్మాగారాల వారు చెల్లించాల్సిన రుసుమును వసూలు చేయనందున.. ప్రభుత్వం 22.4 కోట్ల రూపాయల్ని నష్టపోయింది. మద్యం శుద్ధి కర్మాగారాలు చెల్లించాల్సిన అనుమతి రుసుము, అపరాధ వడ్డీ కింద 13.24 కోట్లు, 6.02 కోట్ల రూపాయల అపరాధ వడ్డీని తక్కువగా వసూలు చేశారు. 7 సంస్థల విషయంలో ఈ తప్పిదాలు చోటుచేసుకున్నట్లు కాగ్‌ తెలిపింది. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి 2018-19లో 37 కార్యాలయాల్లో పన్ను మదింపు, రిఫండ్ రికార్డులు, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. వ్యాట్‌ విధించకపోవడం, జరిమానా, వడ్డీలను విధించకపోవడం, ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను అధికంగా లేదా తప్పుగా క్లెయిమ్‌ చేయడం, టర్నోవర్‌ పన్నును వసూలు చేయకపోవడం, ఇతర అవకతవకల వల్ల ప్రభుత్వం....84.11 కోట్ల రూపాయల్ని నష్టపోయింది.

ప్రతికూలంగా వాస్తవ రాబడి రేటు

రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల్లో 2014-19 మధ్య పెట్టుబడులపై వాస్తవ రాబడి రేటు ప్రతికూలంగా ఉందని కాగ్‌ వెల్లడించింది. ఇది మైనస్ 0.08 నుంచి మైనస్‌ 249.98 శాతం మధ్య ఉందని కాగ్‌ తెలిపింది. మొత్తం 8 ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల్లో ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థలు 69.68 కోట్ల రూపాయల లాభాలు ఆర్జించగా..మిగతా ఆరు 12 వేల 911.56 కోట్ల మేర నష్టాన్ని చవిచూశాయని కాగ్‌ తెలిపింది. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్​ల్లో భారీ నష్టాలు ఇందుకు కారణమని పేర్కొంది. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగటమే డిస్కమ్‌ల నష్టాలకు కారణమని తేల్చింది. ఇడుపులపాయలోని ఆర్జీయూకేటీలో అత్యన్నతస్థాయి పరిశోధన సదుపాయాల కల్పనకు...కోటీ 75 లక్షల రూపాయలతో సేకరించిన పరికరాలు అయిదేళ్లకు పైగా నిరుపయోగంగా ఉన్నాయని తెలిపింది. భూమిశిస్తు శాఖలోని 28 కార్యాలయాల్లో రికార్డులు పరిశీలించినపుడు 53 కేసుల్లో తక్కువగా పన్ను మదింపు, ఇతర అవకతవకల వల్ల ప్రభుత్వానికి 19.12 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. భూమిని ముందస్తుగా స్వాధీనం చేసి..5 నుంచి 19 సంవత్సరాలు గడిచినా అన్యాక్రాంత ప్రతిపాదనలను ఖరారు చేయలేదు. దీని వల్ల 3.08 కోట్ల రూపాయల భూమి విలువను రాబట్టలేకపోయారు.

లోపభూయిష్టంగా క్రీడామౌలిక సదుపాయల కల్పన

రాష్ట్రంలో క్రీడామౌలిక సదుపాయాల కల్పన చాలా ఆలస్యంగా, లోపభూయిష్ట ప్రణాళికతో జరిగిందని కాగ్‌ ఆక్షేపించింది. వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కింద కేంద్రం మంజూరు చేసిన నిధులనూ సరిగా వినియోగించుకోలేదని తప్పుపట్టింది. ప్రాజెక్టుల్ని ప్రారంభించడంలో చూపిన చొరవ పూర్తి చేయడంలో కనబరచలేదని తెలిపింది. క్రీడారంగానికి ప్రభుత్వం చేసిన కొద్దిపాటి బడ్జెట్‌ కేటాయింపుల్ని కూడా సరిగా ఉపయోగించలేకపోయారని తెలిపింది. 2016 మార్చి నుంచి 2018 మార్చి వరకు 47.8 కోట్ల రూపాయల విలువైన 8 క్రీడామౌలిక వసతుల ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయగా.. వాటిలో చాలా ప్రాజెక్టులు జాప్యం వల్ల రద్దయ్యాయని కాగ్‌ పేర్కొంది. 2008-11 మధ్య కాలంలో ఆటస్థలాల అభివృద్ది లేదా పైకా భవనాల నిర్మాణాలకు సంబంధించి.. 4 వేల 149 పనులకు 49.96 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. వీటిలో 27.47 కోట్ల రూపాయలతో 2 వేల112 పనులే 2014 నవంబర్ నాటికి పూర్తయ్యాయని కాగ్‌ పేర్కొంది.

రెవెన్యూ బకాయిలు రూ.10,997.30 కోట్లు

ఇదీచదవండి

రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,29,779 కోట్లు.. సంక్షేమ పథకాలకు పెద్దపీట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.