తెలంగాణ.. హైదరాబాద్ కోఠిలో ఓ కాంట్రాక్టర్ కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. కాంట్రాక్టు డబ్బుల విషయమై రామంతపూర్‌కు చెందిన కాంట్రాక్టర్ రాజిరెడ్డి అతని స్నేహితుడు నరేందర్‌తో కలిసి సుల్తాన్ బజార్ పీఎస్ పరిధిలోని ఇసామియా బజార్లో సాయంత్రం 5.30 గంటలకు ఐదుగురు వ్యక్తులను కలిసేందుకు వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్న తరువాత వారు రాజిరెడ్డిని బలవంతంగా కారులో తీసుకెళ్లారు.
అతని స్నేహితుడు నరేందర్ డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సుల్తాన్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని... సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్టు డబ్బు ఇవ్వకపోవడం వల్లే మాట్లాడేందుకు కారులో తీసుకెళ్లినట్లు విచారణలో దుండగులు వెల్లడించినట్లు సీఐ సుబ్బిరామిరెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: