వైకాపాలో చేరలేదనే కోపంతోనే పల్లా శ్రీనివాస్‌పై విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌లు కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. అధికార పార్టీలో చేరటం లేదని విశాఖ సహా, ఉత్తరాంధ్ర ప్రాంత తెదేపా నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో వైకాపాకు పట్టు లేకపోవటం వల్లే బలమైన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.
తమ పార్టీలోనే దొంగలు, దోపిడీదారులు, కబ్జాకోరులను పెట్టుకుని తెదేపాను నిందించటం విడ్డూరంగా ఉందన్నారు. విజయమ్మను విశాఖవాసులు ఓడించారనే అక్కసుతోనే నగరవాసులపై విజయసాయి రెడ్డి విద్వేషం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలో రాజ్యసభలో సభ్యత్వం ముగుస్తుందని.. విశాఖలో ఎంపీగా పోటీ చేసి ప్రజల్లో తనకున్న ఆదరణను నిరూపించుకోవాలని విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: సర్పంచ్ భర్తపై దాడి దారుణం.. 24 గంటల్లో అరెస్ట్ చేయకుంటే ఆందోళన: తెదేపా