విపత్తలోనూ మంత్రులకు సకల సదుపాయాలు అందుతున్నాయని, సామాన్యులకు మాత్రం రాయితీలు రద్దు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. చంద్రబాబులా పెట్టుబడులు తీసుకొచ్చే సత్తా జగన్కు లేదని, అందుకే ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ దోచుకున్న 43 వేల కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిపై వైకాపా చర్చకు రావాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: ఏ ఘనకార్యాలు సాధించారని సంబరాలు?: యనమల