తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం జగన్నాథపల్లిలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మోటారు వేయకుండానే బోరు నుంచి నీరు ఉబికి వచ్చింది. గత ఆరు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి భూగర్భ జలాలు పెరగడంతో గూడెల్లి ఉప్పులయ్య అనే రైతు బోరు నుంచి నిరంతరాయంగా నీరు వస్తోంది.
మూడు రోజులుగా ఇదే విధంగా బోరు నుంచి నీరు వస్తుందని రైతు తెలిపాడు. కరెంట్ లేకున్నా ఇలా నీరు రావడం పట్ల రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు బోరు వద్దకు చేరుకొని తిలకిస్తూ సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు.