ETV Bharat / city

'వారివన్నీ దోచుకొని దాచుకుందామనే ఆలోచనలే'

సహజ వనరులను దోచుకొని దాచుకుందామనే ఆలోచనలు తప్ప మంత్రివర్గ సమావేశంలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలేమీ లేవని తెదేపా నేత బొండా ఉమా ఆక్షేపించారు. రాష్ట్రంలోని ఇసుకను పక్క రాష్ట్రంలోని ఇసుక మాఫియా కింగ్ శేఖర్ రెడ్డికి అప్పగించేలా పాలకులు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

'వారివన్నీ దోచుకొని దాచుకుందామనే ఆలోచనలే'
'వారివన్నీ దోచుకొని దాచుకుందామనే ఆలోచనలే'
author img

By

Published : Nov 5, 2020, 10:12 PM IST

రాష్ట్రంలోని ఇసుకను పక్క రాష్ట్రంలోని ఇసుక మాఫియా కింగ్ శేఖర్ రెడ్డికి అప్పగించేలా పాలకులు నిర్ణయం తీసుకున్నారని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు బొండా ఉమా ఆరోపించారు. అందుకోసమే మంత్రివర్గ సమావేశం ముసుగు వేశారని దుయ్యబట్టారు. సహజ వనరులను దోచుకొని దాచుకుందామనే ఆలోచనలు తప్ప మంత్రివర్గ సమావేశంలో కొత్తగా తీసుకున్న నిర్ణయాలేమీ లేవని ఆక్షేపించారు.వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అడ్డగోలుగా ఇససుక రీచ్‌లను దోచుకున్నారని విమర్శించారు. రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇసుక రీచ్​లోని అధికారిని దూషించారంటూ ఓ ఆడియోను మీడియా సమావేశంలో వినిపించారు.

తెదేపా ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులను ఆదుకొని, ఆపదసమయాల్లో వారికి అండగా నిలిచిందన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రైతు రుణమాఫీ చెక్కులను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు.బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పిన ప్రభుత్వం..,ఒక్కో కార్పొరేషన్​కు కనీసం 500 కోట్లు కేటాయించలేదన్నారు.

ఇదీచదవండి

కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.