విజయవాడ నగర శివారు రామవరప్పాడులో దారుణం చోటుచేసుకుంది. బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యుడు ఓ యువకుడి గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... హన్మాన్ నగర్ శివారు పొలాల్లో గంజాయి సేవించిన నలుగురు యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘర్షణలో సురేంద్ర అనే యువకుడి పై సాహో అలియాస్ సాయి అనే వ్యక్తి బ్లేడ్‌తో తీవ్రంగా దాడి చేశాడు. సురేంద్ర చనిపోతాడనే భయంతో అతని చొక్క మెడకు చుట్టి సమీపంలోని అపార్ట్మెంట్ లిప్ట్‌లో వదిలి వెళ్లాడు. రక్తపు మడుగులో కొనఊపిరితో ఉన్న సురేంద్రను గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దారుణానికి ఒడిగట్టింది స్థానికంగా ఉన్న బ్లేడ్ బ్యాచ్ సభ్యులు సాహో అతని స్నేహితులుగా గుర్తించారు.
ఇదీచదవండి