మతాల ప్రాతిపదికన వేతనాల పెంపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విజయవాడలోని పార్టీ కార్యలయంలో తప్పుపట్టారు. మంత్రివర్గ సమావేశంలో ఆలయాల అర్చకులు, పాస్టర్లు, ఇమామ్లకు వేతనాలు పెంచడాన్ని ఆక్షేపించారు. దేవాదాయశాఖ ద్వారా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు జీతాలు అందజేస్తున్నారు కానీ ప్రభుత్వం దృష్టిలో పాస్టర్లకు నిర్వచనం ఏమిటి? ఏ ప్రాతిపదికన జీతాలు పెంచి ఇవ్వాలని భావిస్తున్నారో శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతితో, ఆక్సిజన్ అందక అనేక మంది మరణిస్తున్న సమయంలో.. మతపెద్దలకు జీతాలు పెంచడమేమిటని ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తోన్న ఉపాధ్యాయులు రోడ్డున పడుతుండగా.. అలాంటి వారికి ఈ మొత్తాలను అందించి ఆదుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 'అధికారుల్ని జైల్లో వేస్తే ఆక్సిజన్ వస్తుందా?'
విశాఖ కేంద్రంగా పర్యాటక అభివృద్ధికి రూ. 1,000 కోట్లు కేటాయించడం సంతోషమేనని.. కానీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కనీసం రూ. 500 కోట్లను ప్రత్యేకించి వాటిపై శ్రద్ధ చూపలేదని వీర్రాజు విమర్శించారు. పశ్చిమబంగాల్‌లో శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం.. వేల మంది భాజపా కార్యకర్తలు, వారి ఇళ్లు, దుకాణాలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. అందుకు వ్యతిరేకంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 12 వరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: