Somuveer Raju: పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో వైకాపా ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఇళ్ల నిర్మాణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన కోసం 32 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. విజయవాడ కృష్ణా నదీ తీరంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. స్వచ్ఛభారత్ నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను నిలదీస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు.
ఇదీ చదవండి: అరవై ఏళ్ల వయసులో.. "సిక్స్ ప్యాక్" కొట్టేశాడు..!