ఏపీ సీఐడీ అధికారులు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు సహచర ఎంపీలకు రాసిన లేఖ పట్ల ఆయనకు మద్దతు పెరుగుతోంది. భాజపా ఎంపీ, నీటి పారుదల వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్ సంజయ్ జైస్వాల్.. రఘురామ లేఖపై స్పందించారు. ఎంపీపై దాడి తనను బాధించిందని వివరించారు. ఘటనపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానన్నారు. ఈ విషయాన్ని మెయిల్ ద్వారా సంజయ్ జైస్వాల్ రఘురామకు తెలిపారు.
ఇదీచదవండి: Missing mother found: నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన తల్లి..ఇన్నాళ్లు ఎక్కడుందంటే..!