ETV Bharat / city

DK ARUNA: కుటుంబ పాలనకు భాజపా వ్యతిరేకం: డీకే అరుణ

DK ARUNA: కుటుంబ పాలనకు భాజపా వ్యతిరేకమని ఆ పార్టీ నేత డీకే అరుణ అన్నారు.(DK ARUNA) భాజపాలో చేరేందుకు చాలామంది నాయకులు ఎదురుచూస్తున్నారని.. ఏ సమయంలో చేర్చుకోవాలో జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

DK ARUNA
DK ARUNA
author img

By

Published : Jul 30, 2022, 2:31 PM IST

DK ARUNA: కుటుంబ పాలనకు భాజపా వ్యతిరేకమని ఆ పార్టీ నేత డీకే అరుణ అన్నారు.(DK ARUNA) భాజపాలో చేరేందుకు చాలామంది నాయకులు ఎదురుచూస్తున్నారని.. ఏ సమయంలో చేర్చుకోవాలో జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం విషయంలో జగన్, కేసీఆర్‌కు మంచి అనుబంధం ఉందని ఎద్దేవా చేశారు. (DK ARUNA ON YSR PARTY) వైఎస్సార్ కుటుంబంలో వచ్చిన విభేదాల వల్లే షర్మిల పార్టీ పెట్టారని వెల్లడించారు. 2019 ఎన్నికల్లోనూ ఏపీలోనే షర్మిల ప్రచారం చేశారని.. మరి ఏపీలో ఎందుకు పోటీచేయట్లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్​ చేశారు.

ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో(DK ARUNA IN VIJAYAWADA) నిర్వహిస్తామని వెల్లడించారు. జాతీయ నాయకుల విగ్రహాలను శుభ్రం చేసి.. నివాళులతో స్మరించుకోవాలని తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవం పేరుతో కార్యక్రమాలు చేపట్టామని.. దేశభక్తిని, జాతీయభావాన్ని అందరం క‌లిసి చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల ఇళ్లపై జెండాలు ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.