భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో భాజపా ప్రతినిధులు.. రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్(bjp leaders met governor)ను కలిశారు. తితిదే పాలక మండలి నూతన సభ్యుల నియామకం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని భాజపా నేతలు ఆక్షేపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో నియామకంలో ప్రత్యేక ఆహ్వానితుల ఉత్తర్వులను రద్దు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. బోర్డు సభ్యుల నియామక ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంపై ఫిర్యాదు చేశారు. నిబంధనల మేరకు తితిదే బోర్డులో నియామకాలు జరిగేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
వైకాపా ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని.. వీటిని తాము అంగీకరించబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఆహ్వానితులకు కూడా సభ్యులతో సమానమైన ఏర్పాట్లు చేయడం ద్వారా భక్తులకు అసౌకర్యం పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో తితిదే పాలకమండలిపై గవర్నర్ చర్చించాలని కోరామన్నారు. నేర చరిత్ర ఉన్న కొందరి పేర్లు సైతం తితిదే బోర్డు సభ్యుల్లో ఉండడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి..
Vijayawada police on heroin case: హెరాయిన్ వ్యవహారంపై కూపీ లాగుతున్న విజయవాడ పోలీసులు