వినాయక చవితి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా బహిరంగ ప్రదేశాల్లో జరుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను రాష్ట్ర భాజపా నేతలు కోరారు. కరోనా నిబంధనల మేరకు రాష్ట్రంలో అన్నిరకాల పండుగలు నిర్వహించి వినాయక చవితి ఉత్సవాలకు మాత్రమే అడ్డుచెప్పడం.. హిందువుల మనోభావాలను దెబ్బతీమే అవుతుందని భాజపా నేత సత్యమూర్తి అన్నారు. శాంతి భద్రతల సమస్యలు లేవని.. కరోనా నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని తెలిపారు. పండుగ సందర్భంగా పందిళ్లు వేసుకున్న వారిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలకు అనుమతులిచ్చారు.. ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నారని భాజపా నేత సత్యమూర్తి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని డీజీపీ చెప్పారని..అయితే మైనారిటీ పండుగలకు ఓ రకంగా.. వినాయక చవితికి మరోవిధంగా స్పందిస్తున్నారని ఆరోపించారు. ఉత్సవాలను నిర్విఘ్నంగా జరుపుకోవడానికి అనుమతించాలని కోరారు. ఈ మేరకు భాజపా నేతలు సత్యమూర్తితోపాటు షేక్ బాజీ, పాతూరి నాగభూషణం, తదితరులు డీజీపీని కలిశారు.
ఇదీ చదవండి..
LOKESH LETTER: వినాయక పండగకు విఘ్నాలు కల్పించడం సరికాదు: లోకేశ్