bjp leaders on amaravathi capital issue: తిరుపతిలో జరిగిన మహోద్యమ సభలో వైకాపాపై భాజపా నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములిచ్చారని అన్నారు. అమరావతి అభివృద్ధికి.. ప్రధాని మోదీ మద్దతు ఉందని వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూమిని త్యాగం చేశారు: కన్నా
రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి 33వేల ఎకరాల భూమిని రైతులు త్యాగం చేశారని.. భాజపా నేత కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నాడు సంయుక్తంగా అమరావతి అభివృద్ధికి కృషి చేశాయని గుర్తుచేశారు. నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా.. కేంద్రం ఎంతో తోడ్పాటు ఇచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. దోచుకునేందుకు అమరావతిలో ఏం కనిపించలేదని విమర్శించారు. విశాఖ అయితే తన దోపిడీకి అనుకూలంగా ఉంటుందని జగన్ భావించారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో ఒక్క ఇటుకా పెట్టలేదన్న ఆయన.. దోపిడీ అజెండాగానే జగన్ పాలన సాగుతోందని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డికి ఆ శక్తి లేదు : రావెల కిషోర్ బాబు
అమరావతిని ఆపే శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదని.. భాజపా నేత రావెల కిషోర్ బాబు అన్నారు. ఎస్సీల భవిష్యత్ కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన రాజధానిని.. జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. అంబేడ్కర్ స్మృతి వనం ప్రాజెక్టుకు.. ఎస్సీ వ్యతిరేక ముఖ్యమంత్రి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు అంతా ఎదురు చూస్తున్నామన్నారు.
ప్రధాని మద్దతు ఉంది: పాతూరి నాగభూషణం
మహిళలను ఏడిపించిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని.. భాజపా నేత పాతూరి నాగభూషణం అన్నారు. వైకాపా ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని సర్కారని మండిపడ్డారు. అమరావతి అభివృద్ధికి.. ప్రధాని మోదీ మద్దతు ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
CBN On Amaravati Capital: అమరావతి ఏ ఒక్కరిదో కాదు.. ప్రజా రాజధాని: చంద్రబాబు