ETV Bharat / city

Sunil Deodhar: అధికారంలోకి వస్తే.. మతమార్పిడికి వ్యతిరేకంగా బిల్లు: సునీల్ దేవధర్ - ఏపీలో మత మార్పిడులు న్యూస్

Sunil Deodhar: రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని.. పాలకులే వీటిని ప్రోత్సహిస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే.. మతమార్పిడులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొస్తామన్నారు.

అధికారంలోకి వస్తే మతమార్పిడిలకు వ్యతిరేకంగా బిల్లు తెస్తాం

author img

By

Published : Dec 25, 2021, 3:55 PM IST

Updated : Dec 25, 2021, 4:12 PM IST

BJP Leader Sunil Deodhar: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే.. మతమార్పిడులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొస్తామని.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్‌ దేవధర్ అన్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని వాజపేయీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవంలో.. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఆయన పాల్గొన్నారు.

అధికారంలోకి వస్తే మతమార్పిడిలకు వ్యతిరేకంగా బిల్లు తెస్తాం

రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలు సాగుతున్నాయన్న దేవధర్.. ఇటీవల ఓ బహిరంగ సభలో ఎస్సీ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న సుచరిత తాను క్రిస్టియన్‌ అని ప్రకటించుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కూడా తన కుటుంబం క్రిస్టియన్లుగా పేర్కొన్నారన్నారు. ఎస్సీ రిజర్వు నియోజకవర్గాల నుంచి క్రిస్టియన్లు పోటీచేయడం రాజ్యాంగ విరుద్ధమని.. అలాంటి వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయన్న సునీల్ దేవధర్.. పాలకులే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హిందూ ఆలయాల ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని.. భక్తులు దేవాలయాల అభివృద్ధి కోసం సమర్పించిన ఆస్తులు, కానుకలను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారన్నారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి.. మతపరమైన రాజకీయాలను ప్రోత్సహించటం మానుకోవాలని హితవుపలికారు.

ఈనెల 28న బహిరంగ సభ: కన్నా
వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ నెల 28న విజయవాడలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు భాజపా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజపేయీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అవినీతి, కక్ష సాధింపుతో పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని తన స్వంత వ్యాపార సంస్థగా మార్చేశారని దుయ్యబట్టారు. అవినీతి పాలనపై భాజపా పోరాటం చేస్తుందని.. ముఖ్యమంత్రి నిరంకుశ విధానాలను ఈనెల 28న జరగనున్న సభలో ఎండగడతామన్నారు.

Yanamala on State Finance: 'రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అథఃపాతాళానికి నెట్టారు'

Last Updated : Dec 25, 2021, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.