విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్ అభ్యర్థి కొండా శిరీష్ కుమార్తో కలిసి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన, మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు తమవిగా చెప్పుకొని తిరుగుతున్నాయని అన్నారు.
నగరాలు, పట్టణాల్లో పోటీలో ఉన్న భాజపా అభ్యర్థులను గెలిపిస్తే ఆయా ప్రాంతాల్లో.. కేంద్ర నిధులను సమకూర్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని హమీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ భాజపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహేష్ బాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. మున్సిపల్ ఎన్నికలపై మార్చి ఒకటిన ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశం