వైకాపా పాలన ఎలా సాగుతుందో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు వింటే తెలుస్తుందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. దేవుడి గురించి ప్రస్తావించేటపుడు పరుష పదాలతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి మాట్లాతున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దయతో తెదేపాలో గెలిచి...ఇప్పుడు చంద్రబాబును తిడుతున్నారని ఆక్షేపించారు. ఇంత జరగుతున్నా..సీఎం జగన్ ఎందుకు అదుపులో పెట్టటంలేదని ప్రశ్నించారు. భాష మార్చుకోకపోతే...తాము కూడా తగిన విధంగా సమాధానం చెబుతుమన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ కనిపించరు...వినిపించరని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రికి అవగాహన లేకుంటే లక్షల జీతాలు ఇచ్చి పెట్టుకున్న సలహాదారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇదీచదవండి