BANK EMPLOYEES PROTEST AT VIJAYAWADA: బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు విజయవాడలో ఆందోళనకు దిగారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ ఆధ్వర్యంలో వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. ఆందోళనకు సంఘీభావం తెలిపిన తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణలు మాట్లాడుతూ.. 28 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనాల పేరుతో 12కు కుదించారన్నారు.
దేశంలో కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్లిన వారిని పట్టుకోలేదని.. ఎంతోమంది జీవితాలను నాశనం చేసి కూడా దర్జాగా బయట దేశాల్లో వారు బతుకుతున్నారని నేతలు అన్నారు. ప్రైవేటు సంస్థలను వదిలేసి.. ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేయడం అన్యాయమన్నారు. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడమే లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందని దుయ్యబట్టారు.
బ్యాంకులు జాతీయమైన తర్వాత రైతులకు అప్పు పుట్టింది లేదన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు బ్యాంకర్లు అనేక సేవలు అందిస్తున్నారన్నారు. పాలకులు మారితే.. ఉద్యోగుల జీవితాలు తలకిందలు కావడం ఇక్కడే చూస్తున్నామన్నారు. మోదీ సర్కారుపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాటం కొనసాగించాలని అన్నారు.
ఇదీ చదవండి:
BJP MP GVL On Jagan Govt: రెండున్నరేళ్లలో రూ.1.40 లక్షల కోట్ల అప్పు..దివాలా దిశగా రాష్ట్రం: జీవీఎల్