హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని నీతి ఆయోగ్.. భారతదేశంలోనే ఉత్తమ ప్రైవేట్ ట్రస్ట్ ఆసుపత్రిగా గుర్తించటం పట్ల ట్రస్టు ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత పూర్తిగా తన తండ్రి ఎన్టీఆర్దేనని బాలయ్య పేర్కొన్నారు. నిరుపేదలకు సాయం చేయటంతో పాటు.. ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సను సరసమైన ధరకు అందించేలా.. ఆసుపత్రిని స్థాపించినట్లు తెలిపారు. తన తండ్రి కలను సాకారం చేసిన.. వైద్యులు, ఆసుపత్రి సిబ్బందికి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
-
తెలుగురాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి మెరుగైన వైద్యం అందిస్తోందని @NITIAayog ప్రకటించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కేన్సర్ ట్రీట్మెంట్ కి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి ఉండాలన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఆశయం నెరవేరి..(1/2) pic.twitter.com/M7PPFno8td
— Lokesh Nara (@naralokesh) June 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలుగురాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి మెరుగైన వైద్యం అందిస్తోందని @NITIAayog ప్రకటించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కేన్సర్ ట్రీట్మెంట్ కి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి ఉండాలన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఆశయం నెరవేరి..(1/2) pic.twitter.com/M7PPFno8td
— Lokesh Nara (@naralokesh) June 30, 2021తెలుగురాష్ట్రాల్లో లాభాపేక్ష లేకుండా బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి మెరుగైన వైద్యం అందిస్తోందని @NITIAayog ప్రకటించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కేన్సర్ ట్రీట్మెంట్ కి అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రి ఉండాలన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఆశయం నెరవేరి..(1/2) pic.twitter.com/M7PPFno8td
— Lokesh Nara (@naralokesh) June 30, 2021
లాభాపేక్ష లేకుండా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి అందిస్తున్న సేవలకు గుర్తింపు దక్కడం సంతోషాన్నించ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆసుపత్రిని విలువలతో నడుపుతున్న ఛైర్మన్ బాలా మామకు.. వైద్య సిబ్బందికి అభినందనలంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:
AP cabinet : తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు: సీఎం జగన్