ETV Bharat / city

'లోకేశ్ సంతకాలకు అవార్డులు వస్తే.. జగన్ సంతకాలకు ఛార్జ్​ షీట్లు వస్తున్నాయ్' - విజయసాయిరెడ్డిపై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు

వైయస్ జగన్ ఎలాంటి వ్యక్తి అనే విషయం ఆయన తండ్రి రాజశేఖర్​రెడ్డికి తెలుసని.. అందుకే రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా జగన్​ని బెంగళూరు ప్యాలెస్​కే పరిమితం చేశారని.. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. చరిత్ర ఎంత దాచినా నిజం దాగదని ఉద్ఘాటించారు.

ayyannapatrudu comments on cm jagan
అయ్యన్నపాత్రుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు
author img

By

Published : Jun 27, 2020, 3:52 PM IST

ayyannapatrudu comments on cm jagan
అయ్యన్నపాత్రుడు ట్వీట్స్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన సంతకాలకు.. కేంద్రం అవార్డులు పంపిస్తే.. ఇప్పుడు సీఎం జగన్ పెట్టించిన సంతకాలకు సీబీఐ, ఈడీ ఛార్జ్​షీట్లు విడుదల చేసిందని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని చూస్తే జాలేస్తోందన్నారు. కోట్లు పోసి పీకేతో అల్లుడు జగన్​కు శిక్షణ ఇప్పించినా ఆయన పెట్టిన లైవ్ ప్రెస్ మీట్ తుస్సుమందని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు లోకేశ్ లైవ్ చూసి అధికారు పార్టీ నేతలు ఊగిపోతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వారనే విషయం తెలిసే రాజశేఖర్​రెడ్డి ఆయన్ను రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా బెంగళూరులో ఉంచారని వ్యాఖ్యానించారు. చరిత్రను.. దాస్తే దాగదని ఉద్ఘాటించారు.

ఇవీ చదవండి:

విజయసాయిరెడ్డి...ఇలాంటి ప్రయత్నాలు మానుకో:రఘురామకృష్ణరాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.