విజయవాడ నగరంలోకి అన్ని ఆటో సర్వీసులను అనుమతించాలని కోరుతూ డ్రైవర్లు... రవాణా శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. నగరంలోని దాసరి భవనం నుంచి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆటో డ్రైవర్లకు బ్యాంకు రుణాలు ఇప్పించాలంటూ సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఆటోలు రిజిస్ట్రేషన్ చేస్తే అక్కడ నడపాలంటూ... ఆంక్షలు పెడుతున్నారని వాటిని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :