ETV Bharat / city

'పార్టీ కార్యాలయాల ఏర్పాటుపై అందరి అభిప్రాయాలు తీసుకుంటాం' - తెదేపా తాజా వార్తలు

పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యాలయాల ఏర్పాటు నిర్ణయంపై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Atchannaidu on Party offices
పార్టీ కార్యాలయాల ఏర్పాటుపై అందరి అభిప్రాయాలు తీసుకుంటాం
author img

By

Published : Dec 27, 2020, 3:10 AM IST

పార్లమెంట్ పరిధిలో పార్టీ కార్యాలయాల ఏర్పాటు నిర్ణయంపై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. పార్లమెంట్ అధ్యక్షులు, సమన్వయ కర్త, జోనల్ ఇన్​ఛార్జ్​లతో కలిసి ఓ అభిప్రాయానికి వచ్చాక పార్టీకి నివేదిస్తారని వెల్లడించారు. వీటి ఏర్పాటుకు సంబంధించి ఆ లోక్ సభ స్థానం పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యుల అభిప్రాయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ నిర్ణయానికి అనుగుణంగానే అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయం ఏర్పాటు అవుతుందన్నారు.

పార్లమెంట్ పరిధిలో కార్యక్రమాలు అధ్యక్షుల నిర్ణయాలకు అనుగుణంగా జరుగుతాయని అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ పరిధిలో కార్యక్రమాలు ఇన్​ఛార్జులు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం పార్లమెంటు అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్​ఛార్జులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

ఇదీ చూడండి:

కరోనా వ్యాక్సిన్ డ్రైరన్‌కు ముమ్మర ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.